
ఇంటిప్స్
కాకరకాయ కూరలో సోంపుగింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగానూ ఉంటుంది. బంగాళదుంపలను వెల్లుల్లితో కలిపి ఉంచితే అవి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. పాల నుంచి జున్ను వడకట్టినప్పుడు ఆ నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు లేదా గ్రేవీకూరలో పోసి ఉడికిస్తే ఆ వంటకానికి మంచి రుచి వస్తుంది . అప్పడాలు వేయించే రోజున వాటిని ఎండలో పెడితే నూనె ఎక్కువ పట్టదు. బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్‌లో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఇడ్లీ, దోసె పిండి చేయడానికి ముందు బియ్యం కొద్దిగా వేయించి తర్వాత నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తాయి. పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. దోసె, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలుపోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు కలపాలి. ఆ వంటకాలు రుచిగా, కరకరలాడుతూంంటాయి.