ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సారాస్థావరాలపై బుధవారం దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నల్గొండ: ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సారాస్థావరాలపై బుధవారం దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ, చెన్నంపేట, కొండమర్రిపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా కోసం దాచిన 10వేల కిలోల బెల్లం, వంద కిలోల పటికను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ ఎక్సైజ్ అధికారులతో పాటు స్థానిక ఎక్సైజ్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.