
సమ్మర్ డ్రింక్స్
కీరా షర్‌బత్
కావలసినవి: కీరా రసం- అరగ్లాస్; మంచి నీళ్లు - ఒక గ్లాస్; నిమ్మకాయ - ఒకటి; చక్కెర - తగినంత; ఉప్పు - చిటికెడు; మిరియాల పొడి - చిటికెడు
తయారి: మంచినీటిలో కీరా రసం కలిపిన తర్వాత నిమ్మ కాయ రసం పిండాలి. దానిలో చక్కెర, ఉప్పు, మిరియాలపొడి బాగా కరిగే వరకు కలుపు కోవాలి. పైనుంచి సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసుకోవాలి.
ఆపిల్ సినమిన్ జ్యూస్
పీచు పదార్థాలు, ఐరన్, కాల్షియం సుగుణాలు దాల్చినచెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆపిల్‌లో సమృద్ధిగా లభిస్తాయి. వీటితో తయారు చేసిన జ్యూస్‌ని తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
కావల్సినవి:
వెన్న తీసిన పాలు - ఒక కప్పు
మీగడ తీసిన తాజా పెరుగు - ఒక కప్పు
యాపిల్ (చిన్నసైజు) - ఒకటి
దాల్చినచెక్క పొడి - చిటికెడు
తయారి: యాపిల్ శుభ్రపరిచి పీల్ చేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, దీనికి మిగతా పదార్థాలన్నీ కలిపి మెత్తగా అయ్యేలా బ్లెండ్‌చేసి ఫ్రిజ్‌లో వుంచాలి. చల్ల చల్లని సినమిన్ స్మూతి రుచిని ఆస్వాదించండి.