
Sugarcane Juice: చెరుకు రసం తరచుగా తాగుతున్నారా.. అయితే
Sugarcane Juice Health Benefits- వేసవి ఎండల్లో మంచినీళ్లు ఎన్ని తాగినా దాహం తీరినట్లు అనిపించదు. అలాంటప్పుడు చక్కెర అధికంగా కలిపిన శీతల పానీయాలనో, పండ్ల రసాలనో ఆశ్రయించే బదులు నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం ఒకటి లేదా రెండు గ్లాసులు తాగి చూడండి.
దాహార్తి తీరడంతోపాటు చాలా తెరపిగా ఉంటుంది. కేవలం దాహం తీరడమే కాదు, చెరుకురసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
చెరుకు రసం- ఆరోగ్య లాభాలు:
►అలసటగా... నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
►డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
►శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపుతుంది. తద్వారా వేసవిలో చాలామందికి సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
►మెదడులో వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.
►మూత్రపిండాలు, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
►చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
►చెరుకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది.
►బాలింతలు చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది.
►చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి.
►చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొత్త కణాలకు జీవం చేకూరుతుంది.
చదవండి: Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే!