sugarcane juice
-
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్‌ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
చెరుకు మిషన్‌లోకి చున్నీ: యువతి మృతి
శ్రీకాకుళం: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథాలయం వద్దనున్న చెరుకు మిషన్ వద్ద పని చేస్తున్న గాయత్రి (18) అనే యువతి చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కండ్ర వీధికి చెందిన గాయత్రి ఆదివారం సాయంత్రం చెరుకు మిషన్ వద్ద పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోయి ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. స్థానికులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
చెరుకు రసం తీసిన సునీత, వీడియో చూశారా?
సింగర్ సునీత ప్రకృతి ప్రేమికురాలు. సమయం దొరికినప్పుడల్లా పూల మొక్కలు, పండ్ల చెట్ల మధ్య విహారానికి వెళ్తూ సేద తీరుతుంటుంది. తాజాగా ఆమె ఓ ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. కారులో వెళ్తున్న ఆమెకు మార్గమధ్యంలో చెరకు గానుగ కనిపించింది. ఇంకేముందీ, వెంటనే కారు దిగి గానుగను తిప్పుతూ చెరుకు రసం తీసింది. దీనికి సంబంధించిన వీడియోను సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె 'కావాలా చెరుకు రసం, సమ్మర్ గ్లో..' అని అభిమానులను ఊరించింది. ఇక సునీత గానుగ తిప్పడంపై ఫ్యాన్స్ స్పందిస్తూ 'సూపర్ మేడమ్, ఇది మంచి వర్కవుట్ కూడా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమె మామిడి తోటలో దిగిన ఫొటోలు చూసి సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే అదంతా వుట్టి పుకార్లు మాత్రమేనని ఇలాంటివి నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా ఆమె క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హోటల్‌కు రమ్మన్నాడు, నాలాగే 8 మంది! -
Health Tips: బాలింతలు చెరుకు రసం తాగితే...
Sugarcane Juice Health Benefits- వేసవి ఎండల్లో మంచినీళ్లు ఎన్ని తాగినా దాహం తీరినట్లు అనిపించదు. అలాంటప్పుడు చక్కెర అధికంగా కలిపిన శీతల పానీయాలనో, పండ్ల రసాలనో ఆశ్రయించే బదులు నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం ఒకటి లేదా రెండు గ్లాసులు తాగి చూడండి. దాహార్తి తీరడంతోపాటు చాలా తెరపిగా ఉంటుంది. కేవలం దాహం తీరడమే కాదు, చెరుకురసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెరుకు రసం- ఆరోగ్య లాభాలు: ►అలసటగా... నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ►డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ►శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపుతుంది. తద్వారా వేసవిలో చాలామందికి సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ►మెదడులో వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. ►మూత్రపిండాలు, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ►చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ►చెరుకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది. ►బాలింతలు చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది. ►చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి. ►చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొత్త కణాలకు జీవం చేకూరుతుంది. చదవండి: Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! -
చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!
కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ఎత క్యూట్‌గా గెంతులేస్తూ చూడముచ్చటగా ఉంటాయి. అప్పుడే పుట్టిన దూడలు, పెంపుడు జంతువుల పిల్లలు ఎంత ముద్దు ముద్దుగానో ఉంటాయి. పైగా వాటిని వదల బుద్ధి కూడా కాదు. వాటి చిలిపి చేష్టలు భలే సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక పిల్ల ఏనుగు అలాగే చూడముచ్చటగా ఉంది. (చదవండి: వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....) పైగా పింక్ కలర్ దుస్తులతో భలే అందంగా ముద్దుగా ఉంది. అంతేకాదు చెరుకగడలు తినడానికి ఎంతలా ప్రయత్నిస్తుందంటే చివరకు కాలు ఎత్తి లాగడానికీ కూడా చూస్తుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..) Gannu teaching how to eat sugarcane perfectly 😘 pic.twitter.com/4ZIukc0lxN — :象: (@olIolooIl) October 27, 2021 -
చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం
సాక్షి, బెంగళూరు: కామోన్మాదులకు జెండర్‌తో కూడా పనిలేదనేంతలా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో 20 ఏళ్ల యువకుడిపై మరొక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇదే విషయంపై దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబాక అనే గ్రామానికి చెందిన యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చాక భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద ఉండటం గమనించిన అతని తండ్రి కంగారుపడి ఏం జరిగిందని అడగ్గా యువకుడు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు. కబాక గ్రామానికే చెందిన మొహ్మద్ హనీఫ్‌తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్‌కు వెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ అతడిని పలకరించాడు. తెలిసినవాడే అని యువకుడు కూడా మాట కలిపాడు. చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికాడు హనీఫ్. ఇక అదే నెపంతో యువకుణ్ని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి జరిగిన ఘటనపై బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హనీఫ్పై అత్యాచార కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడు హనీఫ్పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు. -
క్యారెట్ కాంతి
►ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది. ►చెరుకు రసం, క్యారెట్ రసం, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది. ►బొప్పాయి గుజ్జు టేబుల్ స్పూన్, క్యారెట్ రసం టీ స్పూన్, తేనె టీ స్పూన్.. ఈ మూడింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం కాంతిమంతం అవుతుంది. -
భగ భగ
వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రెండు మూడు రోజుల్లోనే వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సివస్తే గొడుగు పట్టుకుని బయటకు వస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం కోసం గతంలో ఇంటికి వెళ్లే వారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే లంచ్ బాక్స్ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జన సంచారం లేని కడప కోటిరెడ్డి సర్కిల్ దృశ్యమిది.. ఎండల్లో చల్లదనం కోసం... ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే ప్రధాన రహదారులు సైతం జనం లేక బోసిపోతున్నాయి. ఇక ప్రజలు వేసవి తాపం తీర్చుకునేందుకు కొబ్బరినీరు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ తాగుతున్నారు. పండ్ల రసాలు, కర్బూజకు గిరాకీ పెరిగింది. కొందరు చెడిపోయిన ఫ్రిజ్‌లను తయారుచేయించుకంటుండగా.. మరి కొందరు కుండలను కొనుగోలు చేస్తున్నారు.