సింగర్ సునీత ప్రకృతి ప్రేమికురాలు. సమయం దొరికినప్పుడల్లా పూల మొక్కలు, పండ్ల చెట్ల మధ్య విహారానికి వెళ్తూ సేద తీరుతుంటుంది. తాజాగా ఆమె ఓ ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. కారులో వెళ్తున్న ఆమెకు మార్గమధ్యంలో చెరకు గానుగ కనిపించింది. ఇంకేముందీ, వెంటనే కారు దిగి గానుగను తిప్పుతూ చెరుకు రసం తీసింది.
దీనికి సంబంధించిన వీడియోను సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె 'కావాలా చెరుకు రసం, సమ్మర్ గ్లో..' అని అభిమానులను ఊరించింది. ఇక సునీత గానుగ తిప్పడంపై ఫ్యాన్స్ స్పందిస్తూ 'సూపర్ మేడమ్, ఇది మంచి వర్కవుట్ కూడా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమె మామిడి తోటలో దిగిన ఫొటోలు చూసి సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే అదంతా వుట్టి పుకార్లు మాత్రమేనని ఇలాంటివి నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా ఆమె క్లారిటీ ఇచ్చింది.
చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ..
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హోటల్‌కు రమ్మన్నాడు, నాలాగే 8 మంది!
Comments
Please login to add a commentAdd a comment