కుమారుడి సినిమా చూసి ఏడ్చేసిన సింగర్‌ సునీత | Singer Sunitha Gets Emotional After Watching 'Sarkaru Naukari' Movie | Sakshi
Sakshi News home page

Singer Sunitha: సర్కారు నౌకరి చూసి భావోద్వేగం.. సినిమా ఎమోషనల్‌గా ఉందని కాదు!

Published Sat, Jan 6 2024 3:36 PM | Last Updated on Sat, Jan 6 2024 3:54 PM

Singer Sunitha Gets Emotional After Watching Sarkaru Naukari Movie - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ సునీత తనయుడు ఆకాశ్‌ ఈ మధ్యే సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొటీన్‌ సినిమాల మాదిరిగా కాకుండా వైవిధ్యభరితమైన కథ ఎంచుకున్నాడు. తన సినిమా ప్రేక్షకులకు ఓ సందేశాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. అలా అతడు ప్రధాన పాత్రలో నటించిన సర్కారు నౌకరి జనవరి 1న విడుదలైంది. భావన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించాడు.

తెలియకుండానే కన్నీళ్లు..
తాజాగా ఈ సినిమా చూసిన సింగర్‌ సునీత భావోద్వేగానికి లోనైంది. థియేటర్లలో సినిమా చూసిన అనంతరం గాయని మీడియాతో మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే విడుదలకు ముందే సర్కారు నౌకరిని ఎడిట్‌ చేసేటప్పుడే ఈ సినిమా చూసేశాను. ఇప్పుడు మళ్లీ చూశాక చాలా గర్వంగా అనిపిస్తోంది. హీరోగా కథ నడిపించడమనేది పెద్ద బాధ్యత. ఆకాశ్‌ చాలా బాగా నటించాడు. ఎప్పుడూ సినిమాల్లో యాక్ట్‌ చేస్తానమ్మా అని చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదు. నేను సినిమా ఎమోషనల్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే తల్లిగా తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి.

గుండె బరువెక్కేలా..
కళ్లతో ఎక్స్‌ప్రెషన్‌ పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు సినిమాలో ఆకాశ్‌ కనిపించలేదు. గోపాల్‌ అనే పాత్ర మాత్రమే కనిపించింది. అందరూ చాలా సహజంగా, అద్భుతంగా నటించారు. హృదయానికి హత్తుకునే సినిమాలను థియేటర్‌కు వచ్చే చూడాలి. కొన్ని సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తాయి, కొన్ని ఆహ్లాదాన్నిస్తాయి.. మరికొన్ని గుండె బరువెక్కేలా ఉంటాయి. ఈ చిత్రంలో అన్నీ ఉన్నాయి. ఆకాశ్‌ ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని ఆనందభాష్పాలు రాల్చింది సునీత.

చదవండి: అమ్మ నన్ను తెలుగులో తిట్టేది: జాన్వీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement