నాన్న ఇప్పటికీ కలుస్తాడు.. అమ్మ రెండో పెళ్లి అనగానే.. | Akash Goparaju (Sarkaaru Noukari) Talk About Singer Sunitha Second Marriage - Sakshi

Akash: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని..

Jan 3 2024 1:19 PM | Updated on Jan 3 2024 1:47 PM

Actor Akash About Singer Sunitha Second Marriage - Sakshi

అతడి మీద నమ్మకం ఉందా? అని అడిగాను. చాలా నమ్మకం ఉందని చెప్పింది. నేను అతడిని కలిశాను, నాకూ నచ్చాడు. అమ్మ తన జీవితంలో ఎమోషనల్‌ సపోర్ట్‌ చాలా

స్టార్‌ సింగర్‌ సునీత కుమారుడు ఆకాశ్‌ హీరోగా నటించిన చిత్రం సర్కారు నౌకరి. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎయిడ్స్‌ మహమ్మారి గురించి అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది సినిమా కథ. ఈ చిత్రానికి పాజిటివ్‌ స్పందన లభించగా తాజాగా హీరో ఆకాశ్‌ ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు.

కాళ్లు విరగ్గొడతానంది
ఓ ఇంటర్వ్యూలో అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. 'చిన్నప్పుడు క్రీడలంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. పదో తరగతి చదువుతున్న సమయంలో చిరంజీవి సినిమాలు చూసి డ్యాన్స్‌ నేర్చుకున్నాను. అలా నెమ్మదిగా సినిమాలంటే పిచ్చి ఏర్పడింది. నాకు సంగీతం అంటే ఇష్టం.. కానీ సింగర్‌ అవ్వాలనుకోలేదు. నేను ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి అమ్మ సింగిల్‌ పేరెంట్‌గా మమ్మల్ని పోషించడం మొదలుపెట్టింది. చదువుకునేటప్పుడు నటుడిని అవుతానని చెప్తే అమ్మ కాళ్లు విరగ్గొడతానంది. డిగ్రీ తర్వాత సినిమాల వైపు అడుగులు వేశాను.

ఇద్దరూ ఫ్రెండ్లీగానే ఉంటారు
నాకు మెచ్యురిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే.. ఈ సినీ ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది. ఆడవారికి చాలా ఒత్తిడి ఉంటుంది. అమ్మ ఓ పక్క వాటిని మేనేజ్‌ చేస్తూనే మరోవైపు నన్ను, చెల్లిని అమ్మమ్మ-తాతయ్యలను కూడా చూసుకుంది. మేమందరం కలిసే ఉంటాం. నాన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. నాన్న,  రామకృష్ణగారు(సునీత రెండో భర్త) ఫ్రెండ్లీగానే ఉంటారు. ఈ కోపాలు, పగలు మనసులో పెట్టుకోకుండా అన్నీ వదిలేసి ముందుకు సాగుతున్నాం. నిజానికి మా అమ్మ రెండో పెళ్లి గురించి చాలా భయపడింది.

అమ్మ జీవితంలో చాలా మిస్సయింది
మేము ఎలా అర్థం చేసుకుంటామని టెన్షన్‌ పడింది. నాకు, చెల్లికి.. తను ఆనందంగా ఉంటే అంతే చాలు..  రామకృష్ణగారి మీద నమ్మకం ఉందా? అని అడిగాను. చాలా నమ్మకం ఉందని చెప్పింది. నేనూ అతడిని కలిశాను.. నాకూ నచ్చాడు. అమ్మ తన జీవితంలో ఎమోషనల్‌ సపోర్ట్‌ చాలా మిస్సయింది. ఎన్నో ఏళ్లు అది లేదు.. మొత్తానికి అమ్మకు ఒక తోడు దొరికింది. తన సంతోషమే మాకు కావాల్సింది అని చెప్పుకొచ్చాడు ఆకాశ్‌. కాగా సునీతకు చిన్న వయసులోనే పెళ్లయింది. 19 ఏళ్ల వయసులో కిరణ్‌ కుమార్‌ గోపరాజును పెళ్లాడగా వీరికి ఆకాశ్‌, శ్రేయ సంతానం. పలు కారణాల రీత్యా కొంతకాలానికే సునీత్‌-కిరణ్‌ విడాకులు తీసుకున్నారు. అనంతరం చాలా గ్యాప్‌ తీసుకున్న సింగర్‌ 2021లో వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనిని పెళ్లాడింది.

చదవండి: ఈసారి పెళ్లి పక్కా అంటున్న నటుడు.. నిజమేనా మాస్టారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement