Singer Sunitha Son Aakash Debut As Hero, Details Soon - Sakshi
Sakshi News home page

Singer Sunitha : హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత కొడుకు.. ఫోటోలు వైరల్‌

Published Thu, Nov 10 2022 1:00 PM | Last Updated on Thu, Nov 10 2022 2:40 PM

Singer Sunitha Son Aakash Debut As Hero Details Soon - Sakshi

టాలీవుడ్‌ సింగర్‌ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంలోనూ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌కి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత.

ఇదిలా ఉండగా త్వరలోనే ఆమె కొడుకు ఆకాశ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ పిల్లలను హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తుంటారు. ఇప్పటికే కూతురు శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన సునీత కొడుకును మాత్రం హీరోగా వెండితెరపై చూడాలని కలలు కంటుందట. ఇదే విషయాన్ని సునీత కూడా కన్‌ఫర్మ్‌ చేసేసింది.

ఆకాష్‌ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్‌ తెలిపిన సునీత.. నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్‌ను షేర్‌ చేసింది. దీంతో ఆకాష్‌కి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌. మరి ఆకాష్‌ ఏ సినిమాలో నటిస్తున్నారు? డైరెక్టర్‌ ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement