ఎంఎన్వీ సాగర్, శృతి శంకర్ జంటగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం' కాలం రాసిన కథలు'. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. యస్ యమ్ 4 ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ జగన్నాధ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎంఎన్వీ సాగర్ మాట్లాడుతూ..' నా గురువుగా భావించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోతున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీసుకొస్తున్నాం. 30 ఏళ్ల క్రితం మొదలైన పరువు హత్యల మధ్యే ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం ద్వారా కొంతమంది కొత్తవారు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఉన్నాయి' అని అన్నారు. ఈ చిత్రంలో వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment