ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ హీరోగా ‘తల్వార్’ సినిమా ప్రారంభమైంది. కాశీ పరశురామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వార్నిక్ స్టూడియోస్‌పై భాస్కర్ ఈఎల్‌వీ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టారు.
తొలి సీన్‌కి దర్శకుడు బుచ్చిబాబు సాన గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: కేశవ కిరణ్, కెమెరా: త్రిలోక్ సిద్ధు.
Comments
Please login to add a commentAdd a comment