
ఆకాష్, భావన
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భావన హీరోయిన్‌గా నటించారు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో గంగనమోని శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ‘సర్కారు నౌకరి’ రూపొందింది. ఇందులోని సందేశం, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘సర్కారు నౌకరి’లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ఆకాష్. ‘‘ఈ మూవీతో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు భావన.