ప్రస్తుతం అందరూ సంక్రాంతి మూడ్‌లో ఉన్నారు. మూవీ లవర్స్ అయితే 'హను-మాన్', 'గుంటూరు కారం' సినిమాల్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేశ్, నాగార్జున చిత్రాలు శని, ఆదివారాల్లో రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావుడి ఉంది. అయితే ఈ ఏడాది రిలీజైన ఓ తెలుగు సినిమా థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)
ఏంటా సినిమా?
ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన 'సర్కారు నౌకరి' సినిమా.. ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. సినిమాలో కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ, సరైన స్టార్స్, పబ్లిసిటీ లేకపోవడంతో అసలు థియేటర్లలోకి వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియదు. దీంతో దీని గురించి మర్చిపోయారు. ఇప్పుడు ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరీ థియేటర్లలో రిలీజైన 11 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
మూవీ కథేంటి?
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ కుర్రాడు గోపాల్ (ఆకాశ్ గోపరాజు). ఇతడు అనాథ. అయితేనేం కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. సొంత మండలానికే హెల్త్ ప్రమోటర్‌గా వెళ్తాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, ఊరురా తిరిగి కండోమ్స్ పంచడం ఇతడి పని. కొన్నాళ్లకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే తన భర్తది సర్కారు నౌకరి అని తొలుత మురిసిపోయిన సత్య (భావన).. కొన్నాళ్లకు ఊరిలో అందరూ అవమానిస్తుంటే తట్టుకోలేకపోతుంది. భర్తని ఉద్యోగం మానేయమంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఎయిడ్స్‌ను నియంత్రించేందుకు గోపాల్ ఏం చేశాడు? అనేది స్టోరీ.
(ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment