భగ భగ
వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రెండు మూడు రోజుల్లోనే వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సివస్తే గొడుగు పట్టుకుని బయటకు వస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం కోసం గతంలో ఇంటికి వెళ్లే వారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే లంచ్ బాక్స్ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జన సంచారం లేని కడప కోటిరెడ్డి సర్కిల్ దృశ్యమిది..
ఎండల్లో చల్లదనం కోసం...
ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే ప్రధాన రహదారులు సైతం జనం లేక బోసిపోతున్నాయి. ఇక ప్రజలు వేసవి తాపం తీర్చుకునేందుకు కొబ్బరినీరు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ తాగుతున్నారు. పండ్ల రసాలు, కర్బూజకు గిరాకీ పెరిగింది. కొందరు చెడిపోయిన ఫ్రిజ్‌లను తయారుచేయించుకంటుండగా.. మరి కొందరు కుండలను కొనుగోలు చేస్తున్నారు.