
►ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.
►చెరుకు రసం, క్యారెట్ రసం, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది.
►బొప్పాయి గుజ్జు టేబుల్ స్పూన్, క్యారెట్ రసం టీ స్పూన్, తేనె టీ స్పూన్.. ఈ మూడింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం కాంతిమంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment