
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: కామోన్మాదులకు జెండర్‌తో కూడా పనిలేదనేంతలా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో 20 ఏళ్ల యువకుడిపై మరొక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇదే విషయంపై దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబాక అనే గ్రామానికి చెందిన యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చాక భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద ఉండటం గమనించిన అతని తండ్రి కంగారుపడి ఏం జరిగిందని అడగ్గా యువకుడు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు.
కబాక గ్రామానికే చెందిన మొహ్మద్ హనీఫ్‌తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్‌కు వెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ అతడిని పలకరించాడు. తెలిసినవాడే అని యువకుడు కూడా మాట కలిపాడు. చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికాడు హనీఫ్. ఇక అదే నెపంతో యువకుణ్ని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
చివరికి జరిగిన ఘటనపై బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హనీఫ్పై అత్యాచార కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడు హనీఫ్‌పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment