Belgaum district
-
చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం
సాక్షి, బెంగళూరు: కామోన్మాదులకు జెండర్‌తో కూడా పనిలేదనేంతలా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో 20 ఏళ్ల యువకుడిపై మరొక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇదే విషయంపై దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబాక అనే గ్రామానికి చెందిన యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చాక భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద ఉండటం గమనించిన అతని తండ్రి కంగారుపడి ఏం జరిగిందని అడగ్గా యువకుడు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు. కబాక గ్రామానికే చెందిన మొహ్మద్ హనీఫ్‌తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్‌కు వెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ అతడిని పలకరించాడు. తెలిసినవాడే అని యువకుడు కూడా మాట కలిపాడు. చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికాడు హనీఫ్. ఇక అదే నెపంతో యువకుణ్ని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి జరిగిన ఘటనపై బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హనీఫ్పై అత్యాచార కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడు హనీఫ్పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు. -
కర్నాటక, మహారాష్ట్రల మధ్య ‘భాష’ వివాదం
బెంగళూరు: రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ముంబై మహానగరాన్ని కర్నాటకలో కలపాలని.. ఆలోపు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కర్నాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది డిమాండ్ చేశారు. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో మరాఠీ మాట్లాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేయడంతో వివాదం మొదలైంది. దీనికి బదులుగా ఒక్క అంగులం కూడా ఇచ్చేది లేదని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. దీంతో పాటు కర్నాటక సరిహద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చడంతో ఉద్దవ్ ఠాక్రే వ్యతిరేకించారు. దీంతో వివాదం ముదిరింది. అయితే ఈ సమయంలోనే బుధవారం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై రచించిన ఒక పుస్తకం విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బెల్గాం, కార్వార్, నిప్పని ప్రాంతాల్లో మరాఠీ భాషను మాట్లాడేవాళ్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అయితే ఆ ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి’’ అని సరికొత్త డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సుప్రీంకోర్టులో ఉన్న వివాదం పరిష్కారయ్యే వరకు ముంబైని యూటీగా చేయాలని కోరారు. కర్నాటక సరిహద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చడాన్ని మహా సీఎం ఉద్దవ్ వ్యతిరేకించారు. బెల్గామ్‌ను రెండవ రాజధానిగా చేసిన కర్నాటక తప్పుపని చేసిందని, అందరం ఏకమైతే ఆ ప్రక్రియను అడ్డుకోవచ్చని సీఎం ఉద్దవ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహారాష్ట్ర నాయకులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
విషాదం: రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య
బెంగళూరు: తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడం.. బాకీ తీర్చాలని అప్పు ఇచ్చినవారు వేధించడంతో ఓ కుటుంబం మనస్తాపానికి గురైంది. అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబమంతా సామూహిక బలవన్మరణానికి పాల్పడింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రం బెల్గామ్ జిల్లా రాయ్‌బాగ్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాయ్‌బాగ్ తాలుకలోని భీరాడి గ్రామానికి చెందిన అన్నప్ప (60), మహాదేవి (50) భార్యాభర్తలు. వారికి సంతోశ్ (26), దత్తాత్రేయ (28) ఇద్దరు కుమారులు ఉన్నారు. నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి వారు మృతి చెందారు. దీంతో వారు చెల్లాచెదురుగా పడిపోయారు. అయితే గురువారం తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియడం లేదు. కాకపోతే అప్పులతో పాటు అప్పు ఇచ్చిన వారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతిపై ప్రియునితోపాటు ముగ్గురు గ్యాంగ్ రేప్
దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం ఘటనతో కేంద్రం నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టంతో అయిన మహిళలపై దాడులను అరికట్టవచ్చని కేంద్రం ఆశించింది. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై సామూహిక అత్యాచారం జరుగుతునే ఉంది. ఆ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఇస్లాంపూర్ గ్రామంలో నిన్న రాత్రి ఓ యువతిపై ఆమె ప్రియునితోపాటు ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతి తన తల్లికి విషయాన్ని వెల్లడించింది. దాంతో తల్లి కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతిని ఆసుపత్రికి తరలించారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు నివేదిక అందజేశాయి. తనను ప్రియుడు తన గదికి తీసుకువెళ్లి అక్కడ అత్యాచారం జరిపాడని, అనంతరం మరో ముగ్గురు తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులోఆ యువతి పేర్కొంది. నిందితుల్లో ఒకరైన ప్రియుడు తనకు రెండేళ్ల నుంచి తెలుసని,తనను వివాహం చేసుకుంటానని చెప్పాడని వెల్లడించింది.