యువతిపై ప్రియునితోపాటు ముగ్గురు గ్యాంగ్ రేప్ | Teenager gang-raped by four, including boyfriend | Sakshi
Sakshi News home page

యువతిపై ప్రియునితోపాటు ముగ్గురు గ్యాంగ్ రేప్

Published Wed, Nov 27 2013 12:05 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

యువతిపై ప్రియునితోపాటు ముగ్గురు  గ్యాంగ్ రేప్ - Sakshi

యువతిపై ప్రియునితోపాటు ముగ్గురు గ్యాంగ్ రేప్

దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం ఘటనతో కేంద్రం నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది.  ఆ చట్టంతో అయిన మహిళలపై దాడులను అరికట్టవచ్చని కేంద్రం ఆశించింది. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై సామూహిక అత్యాచారం జరుగుతునే ఉంది. ఆ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఇస్లాంపూర్ గ్రామంలో నిన్న రాత్రి ఓ యువతిపై ఆమె ప్రియునితోపాటు ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 

అనంతరం ఆ యువతి తన తల్లికి విషయాన్ని వెల్లడించింది. దాంతో తల్లి కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతిని ఆసుపత్రికి తరలించారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు నివేదిక అందజేశాయి. తనను ప్రియుడు తన గదికి తీసుకువెళ్లి అక్కడ అత్యాచారం జరిపాడని, అనంతరం మరో ముగ్గురు తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులోఆ యువతి పేర్కొంది. నిందితుల్లో ఒకరైన ప్రియుడు తనకు రెండేళ్ల నుంచి తెలుసని,తనను వివాహం చేసుకుంటానని చెప్పాడని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement