![Married Woman Cuts Her Boyfriend Mysterious Body In Konaseema District - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/20/Married-Woman-Cuts-Her-Boyf.jpg.webp?itok=kiSoTvdv)
రాజోలు(కోనసీమ జిల్లా): మరో మహిళతో సన్నిహితంగా ఉండటం సహించలేని ఓ వివాహిత తన ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజోలు మండలం తాటిపాకకు చెందిన వివాహితకు తన బావ అయిన మలికిపురం మండలం గూడపల్లికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడికి వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు.
ఈ నెల 17వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేరంటూ అతడిని ఆమె ఇంటికి పిలిచింది. ఇంట్లో ఉన్న తన కుమారుడిని వివాహిత మరో రూములో పడుకోబెట్టి గడియ పెట్టింది. సన్నిహితంగా ఉన్న సమయంలో అతడికి, ఆ వివాహితకు మధ్య వివాదం తలెత్తింది.
మరో మహిళతో చనువుగా ఉంటున్నాడంటూ ఆగ్రహించిన ఆమె అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న బ్లేడుతో అతడి మర్మావయవాన్ని కోసేసింది. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన అతడు బంధువుల సహకారంతో రాజోలు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేయడంతో అతడు కోలుకుంటున్నాడని బంధువులు తెలిపారు. అతడిపై దాడి చేసిన వివాహితపై రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రి.. మరో వివాహిత వెంటపడి.. భర్త ఎదుటే..
Comments
Please login to add a commentAdd a comment