Summer Drinks: Papaya Lassi Benefits and Preparation Process in Telugu - Sakshi
Sakshi News home page

Summer Drinks: పోషకాల పపాయ.. సింపుల్‌గా లస్సీ చేసుకుని తాగితే..!

Published Thu, May 12 2022 10:04 AM | Last Updated on Thu, May 12 2022 10:52 AM

Summer Drinks: Benifits With Papaya Lassi - Sakshi

కావలసినవి: 
తొక్క తీసిన బొప్పాయిపండు ముక్కలు – కప్పు, తేనె – టేబుల్‌ స్పూను, మజ్జిగ – కప్పు, యాలకులపొడి – చిటికెడు, పుదీనా తరుగు – టీస్పూను, ఐస్‌క్యూబ్స్‌ – పావుకప్పు, నిమ్మరసం – టీస్పూను. 

తయారీ విధానం..
►బొప్పాయి ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి 
►తరువాత తేనె, పుదీనా తరుగు, యాలకుల పొడి వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. 
►ఇవన్నీ గ్రైండ్‌ అయ్యాక ఐస్‌క్యూబ్స్‌ మజ్జిగ, నిమ్మరసం వేసి గ్రైండ్‌ చేసి, సర్వ్‌ చేసుకోవాలి. 
►బొప్పాయిలోని పాపిన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. 
►దీనిలో విటమిన్‌ సి, కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థం, ప్రోటిన్, విటమిన్‌ ఎ, ఫోలేట్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌ బి1, బి 3, బి 5, ఇ, ఐరన్‌ లు, కెరోటినాయిడ్స్‌ శరీరానికి అంది జీవక్రియలు క్రమబద్ధీకరిస్తాయి. 
►బొప్పాయి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది 
►ఈ లస్సీని రోజుకొక గ్లాసు చొప్పున క్రమం తప్పకుండా తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement