lassi
-
హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరీ చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నెం–1 గా మ్యాంగో లస్సీ... ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ నిలిచింది. ఇది అనేకమందికి, నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్కు మూడో ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్‌లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్ బిర్యానీ ఆరు, షాహి పనీర్ ఏడు, చోలే భటూర్ ఎనిమిది, తందూరీ చికెన్ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి. -
ఎండకు చల్ల గొడుగు
మార్చి నెల రానేలేదింకా... వాతావరణం మారిపోయింది. ఎండకు గొడుగు పట్టాల్సిందే. ఇంట్లోనే ‘చల్ల’ గొడుగు పడదాం. పెరుగు చిలికి... లస్సీ చేద్దాం. రోజ్ లస్సీ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; చల్లటి నీరు – కప్పు; చక్కెర లేదా తేనె – 3 టేబుల్ స్పూన్లు; రోజ్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 10 (పలుకులు చేయాలి). తయారీ: మిక్సీ జ్యూస్ జార్లో పెరుగు, రోజ్‌సిరప్, చక్కెర, నీరుపోసి బ్లెండ్ చేయాలి. రుచిని బట్టి మరింత తీపి కావాలనుకుంటే మరో రెండు స్పూన్ల చక్కెర వేసి కరిగే వరకు కొద్దిసేపు బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోసి పిస్తాతో గారి్నష్ చేసి సర్వ్ చేయాలి. మసాలా చాస్ కావలసినవి: పెరుగు – కప్పు; జీలకర్రపొ డి – అర టీ స్పూన్; చాట్ మసాలా – పా వు టీ స్పూన్; నల్ల ఉప్పు – చిటికెడు; అల్లం తురుము – పా వు టీ స్పూన్; పచ్చిమిర్చి – 1 ( తరగాలి); మిరియాలపొ డి – పా వు టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; పుదీనా – 5 ఆకులు; కొత్తిమీర తరుగు – టీ స్పూన్; మంచి నీరు – 4 కప్పులు. తయారీ: ఒక పా త్రలో పెరుగు, జీలకర్ర, చాట్ మసాలా, జీలకర్రపొ డి, నల్ల ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల΄÷డి, ఇంగువ, ఉప్పు వేసి బీటర్‌తో బాగా చిలకాలి. ఇప్పుడు నీటిని పోసి అరనిమిషం పా టు చిలకాలి. చివరగా పుదీన, కొత్తిమీర వేసి తాగడమే. రోజూ ఉదయం బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు తాగితే ఎండ వేడిమి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కేసర్ ఇలాచీ ... కావలసినవి: పెరుగు – 2 కప్పులు; కుంకుమ పువ్వు రేకలు – 2; తేనె– 3 టేబుల్ స్పూన్లు; యాలకులు – 6 (తొక్క వేరు చేసి గింజలనుపొ డి చేయాలి); బాదం తరుగు – టేబుల్ స్పూన్; పిస్తా – టేబుల్ స్పూన్. తయారీ: ఒక పా త్రలో బాదం, పిస్తా మినహా పైన తీసుకున్న అన్నింటినీ వేసి బీటర్‌తో రెండు నిమిషాల సేపు చిలకాలి. తీపి సరి చూసుకుని అవసరమైతే మరికొంత తేనె వేసి కలిసేవరకు చిలకాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి పైన బాదం, పిస్తాతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది మధ్యాహ్న భోజనంలో భాగంగా తీసుకుంటే బాగుంటుంది. స్వీట్ మింట్ ... కావలసినవి: పెరుగు – కప్పు; తేనె– 2 టేబుల్ స్పూన్లు; పుదీన ఆకులు – అర కప్పు; జీడిపప్పు – 20 (వలిచినవి); బాదం – 10 (తరగాలి); పిస్తా – 10 (తరగాలి); మంచి నీరు – 4 కప్పులు. తయారీ: జీడిపప్పులను చిన్న పలుకులు చేసి, బాదం తరుగు, పిస్తా తరుగులో కలిపి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో పెరుగు, పుదీన, తేనె వేసి బ్లెండ్ చేయాలి. నీటిని కలిపి మరోసారి కలిసేలా తిప్పాలి. ఈ లస్సీని గ్లాసుల్లో పోసి బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇష్టమైతే ఐస్‌క్యూబ్స్ వేసుకోవచ్చు. కేసర్ పిస్తా ... కావలసినవి: పెరుగు – కప్పు; చక్కెర లేదా తేనె – టేబుల్ స్పూన్; క్రీమ్– పా వు కప్పు; కుంకుమ పువ్వు– పది రేకలు; పిస్తా – టేబుల్ స్పూన్; మంచి నీరు – 4 కప్పులు. తయారీ: మిక్సీజార్‌లో పిస్తా, పెరుగు, క్రీమ్, చక్కెర లేదా తేనె, కుంకుమ పువ్వు నాలుగురేకలు వేసి బ్లెండ్ చేయాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేసి పైన రెండు కుంకుమ పువ్వు రేకలతో గా ర్నీష్ చేసి సర్వ్ చేయాలి. పైనాపిల్ ... కావలసినవి: పైనాపిల్ ముక్కలు – అర కప్పు; చక్కెర – పా వు కప్పు; పెరుగు – 2 కప్పులు; క్రీమ్ – పా వు కప్పు; పుదీనా – 4 ఆకులు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; తయారీ: పెనం వేడి చేసి పైనాపిల్ ముక్కలు, చక్కెర వేసి సన్న మంట మీద కలుపుతూ మగ్గనివ్వాలి. సుమారుగా మూడు నిమిషాల సేపటికి ముక్కలు మెత్తబడతాయి. ఆ తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక పా త్రలో పెరుగు, క్రీమ్ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. ఇందులో ఉడికించిన పైనాపిల్ మిశ్రమాన్ని వేసి చిలకాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి పుదీనాతో అలంకరించి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. చల్లగా చిక్కగా ఇష్టపడే వాళ్లు ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తరవాత తాగవచ్చు. -
పోషకాల పపాయ.. సింపుల్‌గా లస్సీ చేసుకుని తాగితే..!
కావలసినవి: తొక్క తీసిన బొప్పాయిపండు ముక్కలు – కప్పు, తేనె – టేబుల్ స్పూను, మజ్జిగ – కప్పు, యాలకులపొడి – చిటికెడు, పుదీనా తరుగు – టీస్పూను, ఐస్‌క్యూబ్స్ – పావుకప్పు, నిమ్మరసం – టీస్పూను. తయారీ విధానం.. ►బొప్పాయి ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►తరువాత తేనె, పుదీనా తరుగు, యాలకుల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక ఐస్‌క్యూబ్స్ మజ్జిగ, నిమ్మరసం వేసి గ్రైండ్ చేసి, సర్వ్ చేసుకోవాలి. ►బొప్పాయిలోని పాపిన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. ►దీనిలో విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థం, ప్రోటిన్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి1, బి 3, బి 5, ఇ, ఐరన్ లు, కెరోటినాయిడ్స్ శరీరానికి అంది జీవక్రియలు క్రమబద్ధీకరిస్తాయి. ►బొప్పాయి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ►ఈ లస్సీని రోజుకొక గ్లాసు చొప్పున క్రమం తప్పకుండా తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. -
Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే!
Summer Drinks- Lassi Recipe: భారత ఉపఖండంలో ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో శతాబ్దాల కాలం నుంచి విరివిగా వాడుకలో ఉన్న వేసవి పానీయం లస్సీ. హిందీలోని కొన్ని మాండలికాల్లో మజ్జిగనే ‘లస్సీ’ అంటారు. ‘లస్సీ’ తయారీలో కమ్మని పెరుగులో చక్కెర కలిపి, దానిని బాగా చిలికి తయారు చేస్తారు. అందులో జీడిపప్పు, కిస్మిస్, చెర్రీ, రోజ్‌వాటర్, స్ట్రాబెర్రీ వేసుకుంటారు. లస్సీ తయారీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన శైలి. పురాణాలలో వర్ణించిన ‘రసాల’ అనే పానీయానికి లస్సీ ఆధునిక రూపం అనుకోవచ్చు. విరాటరాజు కొలువులో వలలుడి వేషంలో ఉన్నప్పుడు భీముడు ‘రసాల’ను తయారు చేసినట్లు ప్రతీతి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పాకిస్తాన్‌లోని సింద్ ప్రాంతాలు లస్సీ తయారీకి ప్రసిద్ధి. ఒడిశాలో లస్సీని ఇంకొంత విలక్షణంగా తయారు చేస్తారు. పెరుగులో పచ్చికోవాను కలిపి బాగా చిలికి, అందులో లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు, మొగలిపూల ఎసెన్స్ వంటివి కలుపుతారు. పెరుగులో ఉండే అన్ని పోషకాలూ లస్సీలోనూ ఉంటాయి. చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే -
Summer Care Tips: ఓవర్ కూల్డ్ వాటర్ తాగుతున్నారా? అయితే..
సమ్మర్ వచ్చేసింది. ఏటా వచ్చేది, వెళ్లేదే కదా! అనుకోవడానికి వీల్లేదు. ఈ సారి వేసవి పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది. వేసవి తీవ్రత గురించి కాదు, వేసవిని దేహం తట్టుకోగలగడం గురించి ఇప్పుడు ప్రశ్న. గడచిన రెండు వేసవి కాలాలు ఇంట్లోనే గడిచిపోయాయి. కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలతో వేసవి కారణంగా ఎదురయ్యే సన్‌స్ట్రోక్ వంటి అనారోగ్యాలను తప్పించుకోగలిగాం. మనుషులు నీడపట్టున ఉన్నప్పటికీ ఈ రెండేళ్లపాటు దేహం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కోవిడ్ వైరస్‌తో పోరాటం చేస్తూనే ఉంది. కోవిడ్ బారిన పడిన వాళ్లలో నీరసం, ఇతర పోస్ట్ కోవిడ్ లక్షణాలను మాత్రమే గుర్తిస్తాం. కానీ కోవిడ్ బారిన పడకుండా తప్పించుకున్న వాళ్లు కూడా వైరస్‌తో సాగిన నిరంతర పోరాటంలో అలసిపోయి ఉన్నారు. కోవిడ్ బారిన పడని దేహాలు కూడా నీరసించి ఉన్నమాట వాస్తవం. అందుకే ఈ వేసవిని ఎదుర్కోవడం కోవిడ్ బారిన పడిన వాళ్లకు, పడని వాళ్లకు కూడా పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఒక మోస్తరు ఎండను కూడా తాళలేని స్థితిలోకి వెళ్లిపోతోంది దేహం. ఈ గడ్డు కాలాన్ని జాగ్రత్తగా దాటడానికి జాగ్రత్తలు తీసుకుందాం. ఏం చేయాలి? ►రోజుకు మూడు లీటర్ల మంచి నీటిని తాగాలి. ఫ్రిజ్‌లో ఉంచిన విపరీతమైన చల్లదనం నిండిన (ఓవర్ కూల్డ్) నీటిని తాగడం కంటే గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు లేదా ఒకమోస్తరు చల్లదనంతో ఉన్న నీటిని మాత్రమే తాగాలి. ►కొబ్బరి నీరు లేదా మజ్జిగ అరలీటరు తాగాలి. ►స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. మరీ వేడి నీటితో స్నానం చేయరాదు. ►గోరువెచ్చటి నీటితో స్నానం చేసిన తర్వాత నాలుగైదు మగ్గుల చల్లటి నీటితో తల, మెడను చల్లబరుచుకోవాలి. ►గది ఉష్ణోగ్రతలు దేహం భరించలేని స్థాయికి పెరిగినట్లు అనిపిస్తే తడి టవల్‌తో ముఖం, మెడ, చేతులను తుడుచుకోవాలి. కోల్డ్ ప్యాక్ వేసినట్లన్నమాట. ►ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదు. ►బయటకు వెళ్లాల్సి వస్తే తలకు క్యాప్ లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి. ►ఆల్కహాలు అలవాటున్న వాళ్లు ఈ కాలంలో మానేయాలి లేదా వీలయినంత తక్కువగా తీసుకోవాలి. ►వ్యాయామం దేహానికి మంచిదే, కానీ ఈ కాలంలో మితంగా మాత్రమే చేయాలి. దేహం నీరసించి పోయేటట్లు వ్యాయామం చేయరాదు. చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? -
సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది..
భువనేశ్వర్: వేసవి కాలం కావడంతో చల్లగా లస్సీ తాగి సేదతీరిన వ్యక్తులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు వచ్చింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపై అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైద్యాఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం కుర్తిలో వారాంతపు సంత జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు స్వాంతన కోసం అక్కడ ఉన్న ఓ దుకాణంలో చల్లగా లస్సీ తాగారు. లస్సీ తాగి వారి పనులు ముగించుకుని వెళ్లారు. కొద్దిసేపటికి లస్సీ తాగిన వారికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. చాలామందికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఒక్కసారిగా ఆస్పత్రులకు బాధితులు వచ్చారు. వంద మందికిపైగా జబ్బు పడ్డారు. దీంతో వైద్యులు కంగారుపడ్డారు. బాధితులంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారని గుర్తించి వివరాలు సేకరించారు. ఈ విచారణలో అందరూ లస్సీ తాగారని గుర్తించి ఆ లస్సీ వలనే కడుపునొప్పి వచ్చిందని నిర్ధారించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనతో వెంటనే స్పందించిన సీడీఎంఓ ప్రఫుల్లా కుమార్ నందా కుర్తి గ్రామాన్ని సందర్శించారు. వైద్యాధికారులు సందర్శించి ఆ దుకాణం వద్ద వివరాలు సేకరించారు. గ్రామంలో ఎవరైనా ఈ బాధతో పడుతున్నారో గుర్తించారు. లస్సీ తాగడంతో కడుపునొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. లస్సీలో ఏమైనా కలిసిందా? లేదా వాడిన ఐస్ మంచిదేనా? శుభ్రమైన నీరు వాడరా? లేదా? అనే విషయాలు వైద్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం -
యువీ సిక్స్.. సిక్సర్ల రహస్యం ఇదేనట..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ ఫీల్డర్, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్‌కు భారత్ అంటే అమితమైన ప్రేమ అని అందరికి తెలిసిందే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా భారత అభిమానులకు మరింత దగ్గరైన జాంటీ తన కూతురికి ‘ఇండియా’ అని పేరు పెట్టి భారత్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. తాజాగా భారత్‌లో పర్యటిస్తున్నఈ 48 ఏళ్ల ఫీల్డింగ్ దిగ్గజం జైపూర్‌లో భారత్ ఫేమస్ డ్రింక్ ‘లస్సీ’ తాగుతూ తీసుకున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘జైపూర్‌లో 1944 నుంచి ఉన్న దుకాణంలో లస్సీ తాగుతున్నాను.’ అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా భారత దిగ్గజ ఆటగాడైన యువరాజ్ సిక్స్.. సిక్సర్ల హిట్టింగ్ వెనుకున్న రహస్యమిదేనని మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు యువీ సైతం తనదైన శైలిలో స్పందించాడు..‘ జాంటీరోడ్స్.. నీ అద్భుత క్యాచ్‌ల వెనుక ఉన్న రహస్యం కూడా ఇదేనేమో.’. అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇక ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన యువీ జాతీయ క్రికెట్ అకాడమీ బెంగళూర్‌లో కసరత్తులు మొదలెట్టాడు. Famous Lassi wala of Jaipur #perfection since 1944 #jaipur #eatlocal pic.twitter.com/8cC6fjqeBC — Jonty Rhodes (@JontyRhodes8) 19 December 2017 And also the secret of your legendary catches — yuvraj singh (@YUVSTRONG12) 19 December 2017 -
13 మంది అత్తింటివారిని చంపేసింది!
లాహోర్: బలవంతపు వివాహం చేసుకున్న ఓ నవవధువు పథకం ప్రకారం విషమిచ్చి 13 మంది అత్తింటివారిని హతమార్చింది. కుటుంబహత్యల కేసులో అరుదైన ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రావిన్సులోని ముజఫర్‌గఢ్‌లో జరిగింది. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాసంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. ఇటీవల బలవంతపు పెళ్లి చేసుకున్న హాసియా అనే మహిళ తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. భర్త అమ్జద్‌ను చంపేసేందుకు పాలలో విషం కలిపింది. అయితే అదృష్టవశాత్తు అమ్జద్ ఆ పాలు తాగలేదు. దీంతో అవే పాలతో లస్సీ తయారుచేసి అత్తింటివారందరికీ అందించింది. విషతుల్యమైన ఆ లస్సీ తాగి 13 మంది చనిపోయారు. మరో 14 మంది విషప్రభావంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పథకం ప్రకారమే తానీ పని చేశానని పోలీసు విచారణలో హాసియా ఒప్పుకుంది. హత్యలో హాసియాకు సాయపడినట్లుగా భావిస్తున్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బంధించిన బాలికను రక్షించిన సింహాలు
సింహం.. క్రూరత్వానికి.. కర్కశత్వానికి మారుపేరు..! అడవికి రారాజు.. జంతువులకు మృగరాజు. ఆధిపత్యం కోసం ప్రత్యర్థులను దారుణంగా చంపుతుంది. మాట వినకుంటే.. తమ సంతానంపై కూడా కరుణ చూపదు. నిర్దాక్షిణ్యంగా పంజా విసురుతుంది. అది దాని నైజం! అంతటి క్రూర జంతువులైన సింహాలు.. మృగాల్లాంటి మనుషుల నుంచి ఓ బాలికను కాపాడాయంటే నమ్ముతారా? సినీఫక్కీలో జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు మీరే చదవండి. 2005లో ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో జరిగింది ఈ ఘటన. దక్షిణ ఇథియోపియాలోని సెఫలోనియా ప్రాంతంలో ఓ గిరిజన గ్రామంలో ‘పోలీ’ అనే బాలిక తల్లిదండ్రులతో నివసించేది. ఆడుతూ.. పాడుతూ అందరితో కలివిడిగా ఉండే పోలీ అంటే గ్రామంలో తెలియనివారుండరు. పశ్చిమ దేశాల కంపెనీలు ఇథియోపియా పాలిట శాపంగా తయారయ్యాయి. వాటి మైనింగ్ దెబ్బకు అక్కడి అరణ్యాలు, గుట్టలు కనుమరుగయ్యాయి. పోలీ స్వగ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా తాగునీటి కొరత. మైళ్ల దూరం కాలినకడన వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. దీంతో గ్రామస్తులు సింహాల దాడిలో చనిపోతున్నారు. అది జూన్2, 2005. మంచినీళ్ల కోసం ఇంట్లో ఉన్న క్యాను తీసుకుని బయల్దేరింది పోలీ. అడవి పక్కన ఓ చెలిమెలో నీళ్లు పట్టుకుని ఇంటికి వస్తుండగా లస్సీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పోలీని ఎత్తుకెళ్లాడు. ఇథియోపియాలో ఓ దుష్ట సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తమ తెగలో నచ్చిన పిల్లను ఎత్తుకెళ్లి పెళ్లాడవచ్చు. అందుకనే లస్సీ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అడవికి సమీపంలో ఉన్న తన పొలంలోని గుడిసెలో పోలీని బంధించాడు లస్సీ. పెళ్లి చేసుకోమని బెదిరించాడు, కొట్టాడు. బెదిరిపోయిన ఆ బాలిక ఏడ్వడం మొదలు పెట్టింది. మరోవైపు చీకటిపడినా పోలీ ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు స్పృహ కోల్పోయి గుడిసెలో పడి ఉన్న పోలీ.. ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచింది. కిటికీ నుంచి ఏవో వెలుగులు ఆకుపచ్చ దీపాల్లా కనిపిస్తున్నాయి. ఏవో కాంతిపురుగులు అయి ఉంటాయనుకుంది. అలా ప్రతిరోజూ రాత్రి ఆ ఆకుపచ్చ వెలుగులు కనిపిస్తున్నాయి. అమ్మనాన్నలను తలుచుకుని పోలీ ఏడవని క్షణం లేదు. మరోవైపు పెళ్లికి ఒప్పుకోవాలంటూ లస్సీ బాలికను రోజూ కొడుతున్నాడు. అలా వారం గడిచింది. అది జూన్ 9. పోలీ జాడ కోసం పోలీసులు, అటవీ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. సాయంత్రం స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘లస్సీ’ భయపడ్డాడు. అదే రోజు రాత్రి పోలీని చంపేద్దామనుకున్నాడు. గుడిసెలో నుంచి పోలీని బయటికి ఈడ్చుకువచ్చాడు. పోలీ నిస్సహాయంగా కేకలు వేస్తోంది. ఇంతలో గుడిసె పక్కనున్న పొదలో ఏదో అలికిడి అయింది. అంతా నిశ్శబ్దం! పొదలను దాటుకుని మూడు భారీ ఆకారాలు బయటికి వచ్చాయి. ఆరు ఆకుపచ్చ లైట్లు మునుముందుకు వస్తున్నాయి. అవి సింహాలు..! అంటే వారంరోజులుగా కిటికీ వద్ద తాను చూసింది సింహాల కళ్లా? దేవుడా.. వీళ్లు చంపుతారనుకుంటే ఇప్పుడు సింహాల చేతిలో చావాలా? అనుకుంటూ కళ్లు మూసుకుంది పోలీ. సింహాలను చూసిన లస్సీ, అతని మిత్రులకు పైప్రాణాలు పైనే పోయాయి. పోలీ మూర్చపోయింది. లస్సీతోపాటు ఆరుగురు మిత్రబృందంపై సింహాలు పంజాలతో విరుచుకుపడ్డాయి. ఆ దెబ్బలకు వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మాత్రం అరుస్తూ గ్రామంవైపు పరుగులు తీశారు. పోలీ కోసం వెదుకుతున్న పోలీసులకు వీరు ఎదురుపడ్డారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గుడిసె వద్దకు పరుగున వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. పోలీ చుట్టూ మూడు సింహాలు కాపలాగా కూర్చున్నాయి. పోలీసులు రాగానే.. లేచి నెమ్మదిగా పొదల్లోకి వెళ్లిపోయాయి. అప్పుడు బాలిక వైపు అడుగేశాడు గాలింపు బృందానికి నేతృత్వం వహిస్తున్న సార్జెంట్ వాంటమ్. విచిత్రమేంటంటే.. సింహాల దాడిలో గాయపడ్డ నిందితులెవరూ మరణించలేదు. బాలికను సింహాలు రక్షించాయన్న వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. పోలీ గురించి జనం కథలు కథలుగా చెప్పుకోసాగారు. కొందరు ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం మొదలు పెట్టారు. బీబీసీ కూడా ఈఘటనపై ప్రత్యేక కార్యక్రమం చేయడంతో పోలీని చూసేందుకు జనం, మీడియా వివిధ దేశాల నుంచి ఆమె ఇంటి ముందు వాలిపోయేవారు. ఈ గోల భరించలేక పోలీ కుటుంబం మరో ఊరికి వలస వెళ్లి రహస్యజీవనం గడపసాగింది. ఈ సంఘటన ప్రముఖ జంతుశాస్త్రవేత్త డాక్టర్ సిన్పూర్ దృష్టిని ఆకర్షించింది. ఇందులో నిజమెంతో తేల్చుకోవాలని 2008లో ఆమె ఇథియోపియాకు వచ్చింది. నానా కష్టాలు పడి పోలీని, సార్జెంట్ వాంటమ్ను కలుసుకుంది. వారితో మరోసారి అడవికి వెళ్లింది. ఆకాశం నుంచి ఊడిపడ్డట్లుగా ఆ సింహాల మంద వారి ముందు ప్రత్యక్షమైంది. ఊహించని పరిణామంతో డాక్టర్ సిన్పూర్, సార్జంట్ భయపడిపోయారు. పోలీ కూడా మరోసారి వీరితో వచ్చి తప్పు చేశాననుకుంది. సింహాలు దగ్గరకు రాసాగాయి. కదలకుండా నిల్చున్నారు ముగ్గురూ. వారి వద్దకు వచ్చిన సింహం పోలీని ప్రేమగా నాలికతో తడిమి మళ్లీ అడవిలోకి వెళ్లింది. -
లస్సీ