
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ ఫీల్డర్, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్‌కు భారత్ అంటే అమితమైన ప్రేమ అని అందరికి తెలిసిందే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా భారత అభిమానులకు మరింత దగ్గరైన జాంటీ తన కూతురికి ‘ఇండియా’ అని పేరు పెట్టి భారత్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.
తాజాగా భారత్‌లో పర్యటిస్తున్నఈ 48 ఏళ్ల ఫీల్డింగ్ దిగ్గజం జైపూర్‌లో భారత్ ఫేమస్ డ్రింక్ ‘లస్సీ’ తాగుతూ తీసుకున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘జైపూర్‌లో 1944 నుంచి ఉన్న దుకాణంలో లస్సీ తాగుతున్నాను.’ అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా భారత దిగ్గజ ఆటగాడైన యువరాజ్ సిక్స్.. సిక్సర్ల హిట్టింగ్ వెనుకున్న రహస్యమిదేనని మరో ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు యువీ సైతం తనదైన శైలిలో స్పందించాడు..‘ జాంటీరోడ్స్.. నీ అద్భుత క్యాచ్‌ల వెనుక ఉన్న రహస్యం కూడా ఇదేనేమో.’. అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌లు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇక ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన యువీ జాతీయ క్రికెట్ అకాడమీ బెంగళూర్‌లో కసరత్తులు మొదలెట్టాడు.
Famous Lassi wala of Jaipur #perfection since 1944 #jaipur #eatlocal pic.twitter.com/8cC6fjqeBC
— Jonty Rhodes (@JontyRhodes8) 19 December 2017
And also the secret of your legendary catches
— yuvraj singh (@YUVSTRONG12) 19 December 2017
Comments
Please login to add a commentAdd a comment