ఈ రోజు యువరాజ్కు వెరీ స్పెషల్ | Rewind: Yuvraj Singh's six sixes off Stuart Broad | Sakshi
Sakshi News home page

ఈ రోజు యువరాజ్కు వెరీ స్పెషల్

Published Mon, Sep 19 2016 11:03 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

ఈ రోజు యువరాజ్కు వెరీ స్పెషల్ - Sakshi

ఈ రోజు యువరాజ్కు వెరీ స్పెషల్

ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది.  డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది.

2007లో తొలి టి-20 ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్, టీమిండియాకు మ్యాచ్కు డర్బన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ జట్టుకు 136 పరుగుల శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాబిన్ ఊతప్ప  అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 155/3. మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి. ఆ సమయంలో యువీ ఐదోస్థానంలో బ్యాటింగ్కు దిగాడు. యువీ ఆడిన తొలి ఆరు బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. 19 ఓవర్లో యువీ స్ట్రయికింగ్ కాగా, స్టువర్ట్ బ్రాడ్ బౌలర్. ఈ ఓవర్లో ఎవరూ ఊహించనివిధంగా యువీ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. బ్రాడ్ వేసిన ఆరుబంతుల్ని యువీ ఆరు అద్భుతమైన సిక్సర్లు సంధించాడు.  స్టేడియంలో, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తున్న అభిమానులను యువీ సిక్సర్లతో కనువిందుచేశాడు. టి20క్రికెట్లో ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్మన్గా, ఓవరాల్గా క్రికెట్ చరిత్రలో నాలుగో ఆటగాడి యువీ చరిత్ర సృష్టించాడు.  యువీ ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 18 పరుగులతో గెలిచింది. ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement