ఆరుబంతుల్లో ఆరు సిక్సులు కొడతా..
Published Tue, Aug 1 2017 1:50 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM
కొలంబో: అవకాశం కలిసొస్తే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడుతానని భారత ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా తెలిపాడు. ఇప్పటి వరకు ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టలాని ఎప్పుడూ అనుకోలేదని, అలాంటి పరిస్థితులు కూడా రాలేదని ఈ స్టైలీష్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. కానీ మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టానని నాలుగో బంతి సిక్సుకొట్టే అవకాశం దొరకలేదని పేర్కొన్నాడు. అలాంటి అవకాశం దొరికితే మాత్రం వదలనని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాడు పుజారా మాత్రం యువీ సిక్సర్ల రికార్డు అధిగమించే శక్తి పాండ్యాకే ఉందని అభిప్రాయపడ్డాడు. సోమవారం బీసీసీఐ టీవీతో ఈ ఇద్దరు ఆటగాళ్లు ముచ్చటించారు.
ఐపీఎల్, వన్డే, టీ20 ఫార్మట్లలో చివర్లో మెరుపులు మెరిపించిన పాండ్యా టెస్టు అరంగేట్రంలో కూడా అదరగొట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాప్ సెంచరీతో ఓ వికెట్ పడగొట్టి ఆల్ రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో విజయానంతరం కెప్టెన్ కోహ్లి పాండ్యాను బెన్‌స్టోక్స్‌తో పోల్చగా.. పాండ్యా మాత్రం నా ఫెవరేట్ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీసేనని చెప్పుకొచ్చాడు.
Advertisement
Advertisement