ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌తో హార్దిక్ పాండ్యా(PC: BCCI)
India Vs England 1st T20- Hardik Pandya: పడిలేచిన కెరటంలా దూసుకువచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2021, టీ20 ప్రపంచకప్-2021 సమయంలో తీవ్ర విమర్శల పాలైన హార్దిక్.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ సారథిగా విజయవంతమయ్యాడు.
తన జట్టును విజేతగా నిలిపి సత్తా చాటాడు. ఇదే జోష్‌లో భారత జట్టులో పునరాగమనం చేసి కెప్టెన్‌గా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ గెలిచాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
యువీ తర్వాత హార్దిక్ పాండ్యానే!
కాగా ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు.ఒక టీ20 మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటుగా మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తర్వాత హార్దిక్ ఈ ఘనత సాధించాడు. కాగా 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్ నమోదు చేశాడు.
ఇక ఇంగ్లండ్‌తో తొలి టీ20లో హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. అదే విధంగా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.
చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు!
Hold the pose.
— England Cricket (@englandcricket) July 7, 2022
Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/HzRgXbIYQ8
Comments
Please login to add a commentAdd a comment