India Vs England 1st T20 Highlights:Hardik Pandya All-Round Show, India To Big Win Against England - Sakshi
Sakshi News home page

IND vs ENG 1st T20: హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ షో.. టీమిండియా ఘన విజయం

Published Fri, Jul 8 2022 2:42 AM | Last Updated on Fri, Jul 8 2022 8:55 AM

Hardik Pandya Steals Show India Beat England By 50 Runs 1st T20 Match - Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో మెరిసిన హార్దిక్‌ పాండ్యా(51 పరుగులు, 4 వికెట్లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

హార్దిక్‌ పాండ్యా(33 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్‌), దీపక్‌ హుడా(17 బంతుల్లో 33 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు‌), సూర్యకుమార్‌ యాదవ్‌(19 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అంతకముందు రోహిత్‌ శర్మ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఇన్‌ఫామ్‌ బ్యాట్స్‌మన్‌.. కొత్త కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హారీ బ్రూక్‌ 28, మొయిన్‌ అలీ 36 పరుగులు చేసినప్పటికి ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

హార్దిక్‌ పాండ్యా సహా అర్షదీప్(2 వికెట్లు)‌, చహల్‌(2 వికెట్లు) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. చివర్లో జోర్డాన్‌ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 శనివారం(జూలై 9న) జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement