southampton
-
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ హుడా(17 బంతుల్లో 33 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అంతకముందు రోహిత్ శర్మ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఇన్ఫామ్ బ్యాట్స్‌మన్.. కొత్త కెప్టెన్ జాస్ బట్లర్ భువనేశ్వర్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హారీ బ్రూక్ 28, మొయిన్ అలీ 36 పరుగులు చేసినప్పటికి ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు. హార్దిక్ పాండ్యా సహా అర్షదీప్(2 వికెట్లు), చహల్(2 వికెట్లు) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. చివర్లో జోర్డాన్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 శనివారం(జూలై 9న) జరగనుంది. For his brilliant show with the bat and ball, @hardikpandya7 is adjudged Player of the Match as #TeamIndia win the first T20I by 50 runs. Take a 1-0 lead in the series. Scorecard - https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/oEavD7COnZ — BCCI (@BCCI) July 7, 2022 Vintage Mo. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/AQ8cK5sTph — England Cricket (@englandcricket) July 7, 2022 Brilliance from Sam! India have set us 199 for victory in the first @vitality_uk IT20. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/ZfwdPi6VGf — England Cricket (@englandcricket) July 7, 2022 -
WTC Final: మూడేళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ పైనల్లో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ మార్క్‌ను చేరుకోలేకపోయాడు. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. ఇంతకముందు 2018లో ఇంగ్లండ్ గడ్డపైనే లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క అర్థ సెంచరీ నమోదు కాలేదు. ఇక టీమిండియా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా ఓవర్‌నైట్ స్కోరు 64/2 తో ఆరో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే పుజారా, కోహ్లిల రూపంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడినుంచి ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేయని టీమిండియా 170 పరుగులకే చాప చుట్టేసింది. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ 30 పరుగులు చేశాడు. మొత్తంగా 138 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా కివీస్ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా కివీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవన్ కాన్వే(19), టామ్ లాథమ్(9) పరుగులు చేసి ఔటవ్వగా.. కేన్ విలియమ్సన్(8), రాస్ టేలర్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: గ్రౌండ్‌లోనే టవల్ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే WTC Final: కివీస్ ఈ పాటికే గెలవాల్సింది.. -
రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్‌పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
WTC ఫైనల్: నాలుగో రోజు వర్షార్పణం
సౌతాంఫ్టన్: ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పైనల్‌కు వరుణుడు అడ్డంగా మారాడు. ఇక నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభమవుతుందని ఆశించిన ప్రేక్షకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ మెగా ఫైనల్‌కు వేదికైన సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి వర్షం కురవడంతో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచిపోయింది. దీంతో పాటు ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే నాల్గో రోజు మ్యాచ్ జరిగే సూచనలు లేవని ఫీల్డ్ ఎంపైర్లు తెలపడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా నాలుగో రోజు ఆట వర్షార్పణం అయ్యింది. చదవండి: WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా! -
WTC ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌పై సందేహాలు
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు అడుగడుగునా వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ ఆరంభమైంది మొదలు ఇప్పటివరకూ ఇక్కడ ఏదొక సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశాలు కనబడుటం లేదు. నాలుగో రోజు ఆటకు సైతం వర్షం అడ్డంకిగా మారింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా వర్షం అంతరాయం కల్గించింది. అక్కడ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇక వర్షానికి తోడు సరిపడనంత వెలుతురు లేకపోవడం ఆట కొనసాగింపుకు సమస్యగా మారుతోంది. నాలుగో రోజు మ్యాచ్ నిర్వహించాలా వద్దా అన్నదానిపై అంపైర్ల సమీక్షిస్తున్నారు. ఈరోజు మొత్తం ఆడపా దడపా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక్కడ చదవండి: న్యూజిలాండ్‌దే పైచేయి -
తొలి పరుగు కోసం 36 బంతులు.. పుజారాపై మీమ్స్ వర్షం
సౌతాంప్టన్: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆటతీరు ఈ మధ్య భారత అభిమానులకు మింగుడు పడటం లేదు. అతను అసలైన టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. కొన్ని సార్లు పరగులు చేయడానికి మరీ ఎక్కువ బంతులు తీసుకోవడం.. జట్టు ప్రయోజనాలకు తగ్గట్టుగా ఆడకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ పుజారా మరోసారి ప్రత్యర్థి బౌలర్లతోపాటు అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ (34), శుభ్‌మన్ గిల్ (28) శుభరంభం ఇచ్చారు. ఓపెనర్లు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పుజారా తొలి పరుగు చేయడానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టిన అతడు చివరికి 54 బంతుల్లో 8 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా, పుజారా ఇన్నింగ్స్‌పై ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. Pujara reminds me of this inning, and Non- striker is Virat 😭 pic.twitter.com/GCmXWJ01Fr — Liv 💫 (@Virat_Mamta) June 19, 2021 Pujara in first sessionpic.twitter.com/0BIZheNSfv — వేటగాడు (@rao_4005) June 19, 2021 New Zealand players' strategy to get Pujara out in the #WTCFinal2021pic.twitter.com/AsvJMXMeb8 — BufferedStart (@BufferedStart) June 17, 2021 చదవండి: WTC Final: 250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి.. -
WTC Final Day 3: ముగిసిన మూడో రోజు ఆట
సౌతాంప్టన్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. అయితే, వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ కుదర్లేదు. ఇక మూడో రోజైన ఆదివారం ఆట పూర్తిగా కొనసాగించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఎందుకంటే సౌతాంప్టన్ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఈ కారణంగా మూడో రోజు సైతం మ్యాచ్ రోజంతా సజావుగా జరగడం కష్టమేనని బ్రిటీష్ వాతావరణ శాఖ తెలిపిన నివేదికలు చెప్తున్నాయి. అవుట్ ఫీల్డ్ తడిగా కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. అప్డేట్స్: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ► ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేన్ విలియమ్సన్ (12), రాస్ టేలర్ (0) ఉన్నారు. ► కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు లాథం (30) పరుగుల చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు: 90/ 1 ( 42 ఓవర్లు).. కాగా క్రీజులో కేన్ విలియమ్సన్ ( 11 ), కాన్వే ( 46 ) ఉన్నారు. కివీస్ ఓపనర్లు నిలకడగా.. ►ప్రతిషాత్మక మ్యాచ్‌లో భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడమే కాకుండా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఓపనర్లు నిలకడగా ఆడుతున్నారు. లాథమ్ ( 17) , కాన్వే ( 18 ) రాణించడంతో.. టీ బ్రేక్ సమయానికి 21 ఓవర్లలో కివీస్ జట్టు స్కోరు 36/ 0 గా ఉంది. తొలి ఇన్నింగ్స్: టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ ► న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో 217 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ముగించేసింది. ► భారత బ్యాట్స్మెన్లు.. రహానె (49), కోహ్లీ (44), రోహిత్ (34), గిల్ (28) స్కోరు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో.. జేమిసన్‌కు 5, బౌల్ట్, వాగ్నర్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ► ఇషాంత్ ( 4) , బుమ్రా, షమీ క్రీజులోకి రాగానే వికేట్ సమర్పించుకున్నారు. కాగా జడేజా 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ►ప్రస్తుతం టీమిండియా స్కోరు - 211/ 7 (89 ఓవర్లు). ► క్రీజులోకి వచ్చిన అశ్విన్ ( 27 బంతులల్లో 22, 3*4 ) బ్యాట్‌తో పరుగులు రాబట్టినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దీంతో 205 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా అశ్విన్ వెనుదిరిగాడు. ► క్రీజులో జడేజా ( 10 ), అశ్విన్ ఉన్నారు. టీమిండియా స్కోరు-182 /6 ( 82 ఓవర్లు ) ► క్రీజులోకి వచ్చిన జడేజా రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ పై ఆశలు రేపిన, రహానే రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా రహానే ( 117బంతుల్లో 49, 5*4 ) అర్థ సెంచరీని ఒక్క పరుగు తేడాతో చేజార్చుకున్నాడు. ► క్రీజులో రవీంద్ర జడేజా ( 6), రహానే ( 42 ) ఉన్నారు. టీమిండియా స్కోరు -171/5 ( 77.2 ఓవర్లలో) నాలుగు పరుగులు.. ఐదో వికెట్‌గా పంత్ పెవిలియన్‌కు చేరాడు ►క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ కేవలం నాలుగు పరుగులకే ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. పంత్ ( 22 బంతుల్లో 4, 1*4 ) చేసి జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారీ స్కోరుకు బ్రేక్.. విరాట్ వికెట్ డౌన్ ►మూడో రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైన కాసేపటికే నాలుగో వికెట్ రూపంలో కెప్టెన్ విరాట్ కోహ్లి (132 బంతుల్లో 44, 1x4) పెవిలియన్ చేరాడు. దీంతో విరాట్ కోల్పోవడంతో భారత్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ప్రస్తుతం రిషభ్ పంత్, రహానే (32) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 68 ఓవర్లలో 149/4. మ్యాచ్‌పై పట్టు కోసం.. భారీ భాగస్వామ్యం కావాల్సిందే ► రెండో రోజు ఆట ముగిసే సమయానకి టీమిండియా స్కోరు.. 64.4 ఓవర్లలో 146/3. కోహ్లి (44 పరుగులు), రహానే (29) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్‌గా రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6×4), రెండో వికెట్‌గా శుభ్‌మన్ గిల్ (28; 64 బంతుల్లో 3×4), మూడో వికెట్‌గా చతేశ్వర్ పుజారా (8) వెనుదిరిగారు. చదవండి: WTC Final: కివీస్‌కు ఫీల్డ్ అంపైర్ సాయం.. ఫ్యాన్స్ ఆగ్రహం -
WTC Final Day 2: వెలుతురు లేమి, ఆట కొనసాగేనా?
సౌతాంప్టన్: టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను వాతావరణం ప్రభావితం చేస్తోంది. వర్షం కారణంగా టాస్ పడకుండానే తొలి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణుడు కరుణించడంతో రెండో రోజున ఆట ఆరంభమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ(34), శుభ్‌మన్ గిల్(28) ఫర్వాలేదనిపించారు. ఇక నయావాల్ ఛతేశ్వర్ పుజారా(8) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. వెలుతురు లేని కారణంగా ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. కాసేపు తర్వాత ఆటను అనుకూలంగా ఉండడంతో మళ్లీ ప్రారంభించిన కొద్ది సేపటికే వెలుతురు సరిగా లేకపోవడంతో నిలిపివేశారు. అప్డేట్స్: ►వెలుతురు లేని కారణంగా ఆటను ఆపేయగా, ప్రస్తుత టీమిండియా స్కోరు:146/3(64.4 ఓవర్లలో) ►ప్రస్తుతం కోహ్లి(44 పరుగులు), రహానే(29) క్రీజులో ఉన్నారు. ►వెలుతురు లేని కారణంగా ఆటను ఆపేయగా, ప్రస్తుతం ఆటకు అనుకూలంగా ఉండడంతో తిరిగి ప్రారంభించారు. ► కోహ్లి(40 పరుగులు), రహానే(22) క్రీజులో ఉన్నారు. ఆట నిలిచే సమయానికి టీమిండియా స్కోరు: 134/3(58.4 ఓవర్లలో) ►వెలుతురు తక్కువగా ఉన్నందును ఆట కొనసాగించాలా వద్దా అన్న అంశంపై అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో చర్చలు కొనసాగిస్తున్నారు. ►రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లి సేన మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ పదునైన ఇన్‌స్వింగర్‌ను అంచనావేయడంలో పొరబడ్డ నయావాల్ ఛతేశ్వర్ పుజారా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 54 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు(రెండు ఫోర్లు) చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కాగా పుజారా అవుట్ అయిన విధానంపై సందేహం వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లగా నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. ►టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ 28 పరుగుల(3 బౌండరీలు) వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పుజారా, కోహ్లి క్రీజులో ఉన్నారు. ►లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 69-2(28 ఓవర్లలో) ►భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 21వ ఓవర్లో జెమీషన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 34 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలు ఉన్నాయి. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు: 62-1. ►20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 62-0 ►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 37-0 -ఓపెనర్లు రోహిత్ శర్మ(21), శుభ్‌మన్ గిల్(15) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ జెమీషన్ బౌలింగ్ అటాక్ కొనసాగిస్తున్నాడు. ►భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మరణం పట్ల భారత జట్టు నివాళులు అర్పించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలో అడుగుపెట్టారు. ►ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రెండో రోజున ఆట ఆరంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. కోహ్లి సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. ఇక వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్నీ నికోలస్, బీజే వాట్లింగ్(వికెట్ కీపర్), కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, కైలీ జెమీషన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్. #TeamIndia is wearing black armbands in remembrance of Milkha Singhji, who passed away due to COVID-19. 🙏#WTC21 — BCCI (@BCCI) June 19, 2021 చదవండి: టీమిండియా బతికిపోయిందిగా; మీరైతే కళ్లప్పగించి చూడండి! -
WTC Final: కేదార్ చెప్పినట్లు మీలో ఎవరైనా చెప్పండి బ్రో!
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురయ్యారు. ‘‘వరుణుడా కాస్త కరుణించు.. మా ఫేవరెట్ మ్యాచ్ చూసేందుకు వీలు కలిగించు’’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది ఔత్సాహిక నెటిజన్లు మాత్రం తమ సృజనాత్మకతకు పదునుపెడుతూ ఫన్నీ మీమ్స్, ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘‘వరల్డ్ కప్-2019 సమయంలో కేదార్ యాదవ్ చెప్పినట్లుగా ఇప్పుడు కూడా ఎవరైనా ఒక టీమిండియా ప్లేయర్.. వర్షాన్ని వెళ్లిపొమ్మని చెప్పవచ్చుగా బ్రో’’ అంటూ ఓ ట్విటర్ యూజర్ పాత వీడియోను పంచుకున్నారు. మరొకరేమో.. ‘‘టీమిండియా కాదు.. న్యూజిలాండ్ కాదు.. వర్షం టాస్ గెలిచింది. ఇరుజట్లపైన పైచేయి సాధించింది. ఇప్పుడు రెండు జట్ల ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా’’ అంటూ ఇద్దరు పిల్లలు బిక్క ముఖాలు వేసుకుని కన్నీరు కారుస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇంకొంత మందేమో.. ‘‘ఇదిగో ఇప్పుడు క్రికెట్ ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది’’ అని గల్లీ క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి జారిపోయిన దృశ్యాలు షేర్ చేసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి మరి. కాగా వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మధ్యాహ్నం 3 గంటల(భారత కాలమానం ప్రకారం)కు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ తొలి సెషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: WTC Final: వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు Need someone from team India to tell rain to move somewhere else like Kedar Jadhav did in 2019 World Cup. pic.twitter.com/zrFZDwyHTk — Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2021 #WTCFinal2021 Live from South Hampton😃#WorldTestChampionship #WTCFinal2021 @BCCI pic.twitter.com/2ksfvjLUjs — HEMANT SEN🇮🇳 (@RSunnny) June 18, 2021 Scenes in Southampton considering 🌧️. Rain #INDvsNZ #WTCFinal2021 #Southampton #WTCFinal #WTC21 #FridayThoughts #fridaymorning pic.twitter.com/GGAaHXcmLe — वि शा ल (@_iamvish) June 18, 2021 India and New Zealand fans watching rain delays together. 😂#INDvNZ #WTCFinal #WTCFinal2021 pic.twitter.com/LcO1TSAKlf — CricBlog ✍ (@cric_blog) June 18, 2021 It has been raining since the last few days in Southampton ! Day 1 of WTC Final expected to he washout! #INDvsNZ #WorldTestChampionship #WTCFinal2021 #June18#ICCWTCFinal #WTCFinal Mean While Rain : pic.twitter.com/0lUsav1CGl — Aryan (@aryn_vrm) June 18, 2021 Rain Rain go away Come again after 22 India wants to play Rain Rain go away 🥺#WTC21 #WTCFinal pic.twitter.com/N8P3S2DTpX — Ayush (@Ayush18virat) June 18, 2021 -
శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ పిచ్‌లకి టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తొందరగానే అలవాటుపడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3న సౌతాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా గడుపున్నారు. ఈ క్రమంలో నిన్న భారత బృందం రెండు జట్లుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధశతకంతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ స్కోర్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోరు చేశారన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, 2018లో మొదటిసారి ఇంగ్లండ్‌లో పర్యటించిన రిషబ్ పంత్.. సూపర్ సెంచరీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ పిచ్‌లపై అతని రికార్డు మరింత మెరుగుపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో.. పంత్ ఫామ్‌లోకి రావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా, డబ్యూటిసీ ఫైనల్ తర్వాత భారత్.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. చదవండి: India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ -
ముంబై టు లండన్.. అలా సాగిపోయింది
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనను 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఢీకొనేందుకు టీమిండియా లండన్‌లో ల్యాండ్ అయ్యింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు సాధన చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆటగాళ్లు ఒకరిని ఒకరు కలుసుకునే వీలు ఉండదు. కాగా, భారత బృందం ముంబై నుంచి బయల్దేరి, సౌతాంప్టన్ చేరుకునే వరకు జరిగిన మొత్తం సన్నివేశాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. జూన్ 2న భారత్ పురుషుల, మహిళా క్రికెటర్ల బృందం.. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరింది. 🇮🇳 ✈️ 🏴 Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ — BCCI (@BCCI) June 4, 2021 ఇంత భారీ ఎత్తున భారత క్రికెట్ బృందం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ఈ జర్నీని క్రికెటర్లు ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకు బీసీసీఐ ప్రతి ఒక్క సన్నివేశాన్ని రికార్డు చేసి, ట్విటర్లో షేర్ చేసింది. విమానంలో పురుష, మహిళా క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడుతూ పాడుతూ, ఇంటర్యూలు చేసుకుంటు సరదాగా గడిపిన సన్నివేశాలు అభిమానులకు అలరించాయి. కాగా, జూన్ 18న టీమిండియా.. న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, జూన్ 16న భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌తో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక కానుంది. చదవండి: పాక్ జట్టులోకి భారీ హిట్టర్.. -
‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 సౌతాంప్టన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్‌మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే... మ్యాచ్ తేదీలు: జూన్ 18 నుంచి 22 వరకు వేదిక: సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ మైదానం ఉపయోగించే బంతి: భారత్‌లో సాధారణంగా టెస్టు మ్యాచ్‌లను ఎస్జీ బంతులతో, న్యూజిలాండ్‌లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్ కోసం డ్యూక్స్ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వాడే డ్యూక్స్ బంతులు సీమ్ ఎక్కువగా ఉండి బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్‌కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది. రిజర్వ్ డే ఉందా: ఉంది, జూన్ 23ను రిజర్వ్ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్ డేలో సమయాన్ని వాడుకుంటారు. రిజర్వ్ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్ రన్లను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే ముందు బ్యాట్స్‌మన్ షాట్‌కు ప్రయత్నించాడా అనే అంపైర్‌ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్ జోన్’ ఎత్తును కూడా పెంచారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగేది ఎక్కడో తెలుసా?
ముంబై: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదిక మారనుంది. తొలుత ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నిర్వహించాలని ఐసీసీ భావించినప్పటికీ.. వివిధ కారణాల చేత వేదికను సౌథాంప్టన్‌కు మార్చాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వేదిక మార్పు అంశం ఐసీసీ పరిధిలో ఉంటుంది. కానీ బీసీసీఐ అధ్యక్షుడు ఐసీసీతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండా ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించడం పలు సందేహాలకు తావిస్తుంది. ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తున్న బీసీసీఐ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే లండన్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగానే వేదికను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్‌కు తరలించారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య సౌథాంప్టన్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నామని, అందులో భాగంగానే వేదికను మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు క్లిష్ట పరిస్థితుల్లో సాగాయన్నాడు. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
షేమ్ షేమ్.. షాహిన్ ఆఫ్రిది
సౌతాంప్టన్ : టెస్టు క్రికెట్లో రనౌట్ అనే పదమే చాలా తక్కువగా వినిపిస్తుంది. కానీ అనిశ్చితికి మారుపేరుగా ఉండే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు.. జట్టులోని ఆటగాళ్లు కూడా అంతే.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో షాహిన్ ఆఫ్రిది రనౌటైన తీరు చూస్తే జాలేస్తుంది. షాహిన్ తనంతట తానే రనౌట్ కావడం హాస్యాప్పదంగా ఉందంటూ ట్విటర్లో అభిమానులు పేర్కొంటున్నారు. (సచిన్ మొదటి సెంచరీకి 30 ఏళ్లు) సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న పాక్ జట్టు 75 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన బంతి రిజ్వాన్ లెగ్‌ను తాకుతూ బయటికి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ కోసం అంపైర్‌ను అడుగుతున్నారు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న రిజ్వాన్ కాల్ వినిపించుకోకుండానే షాహిన్ పరుగు కోసం సగం క్రీజు వదిలి వచ్చాడు. ఇంతలో బంతిని అందుకున్న డొమినిక్ సిబ్లే కళ్లు చెదిరే వేగంతో వేసిన డైరెక్ట్ త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. అసలు ఇలా ఉదారంగా వికెట్ వస్తుందని ఇంగ్లండ్ కూడా ఊహించి ఉండదు. Another piece of brilliance in the field from @DomSibley! 🎯 Scorecard/Clips: https://t.co/yjhVDqBbVN#ENGvPAK pic.twitter.com/FuEAifdP5p — England Cricket (@englandcricket) August 14, 2020 అనవసరంగా ఒక డాట్ బాల్‌కు అవుటయ్యాననే ఫీలింగ్ కలిగిందేమో.. షాహిన్ ముఖానికి చేతిని అడ్డుపెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం షాహిన్ రనౌట్ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. డొమినిక్ సిబ్లే అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాన్ని చూడండి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్‌ను ఆతిధ్య ఇంగ్లండ్‌కు సమర్పించుకున్న పాక్ రెండో టెస్టును నిరాశజనంకగానే ప్రారంభించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 60*, నసీమ్ షా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, స్టువర్ట్ బ్రాడ్ 3, సామ్ కరన్, వోక్స్ తలా ఒక వికెట్ తీశారు.(ఎక్కడైనా ధోనియే నెంబర్ వన్) -
మరో ‘హోరాహోరీ’కి రంగం సిద్ధం
సౌతాంప్టన్ : విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌ను చేతులారా ప్రత్యర్థికి అప్పగించిన జట్టు ఒక వైపు... ఓటమి వైపు సాగుతున్న దశనుంచి గెలుపును అంది పుచ్చుకున్న జట్టు మరో వైపు... ఈ సారి జరగబోయే సమరంలో ఎవరిది పైచేయి కానుంది. గత మ్యాచ్‌లాగే పోరు హోరాహోరీగా సాగుతుందా లేదా ఏకపక్షమా... వీటన్నింటికి రోజ్‌బౌల్ మైదానంలో సమాధానం లభించనుంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటినుంచి ఇక్కడ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టులో నెగ్గిన ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా...ఈ మ్యాచ్ కూడా గెలిస్తే వరుసగా రెండో సిరీస్ ఆ జట్టు ఖాతాలో చేరుతుంది. మరో వైపు గత అనుభవంతో ఈ సారైనా మెరుగ్గా ఆడి సిరీస్ సమం చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. స్టోక్స్ లేకుండానే... ఒక మార్పు మినహా తొలి టెస్టులో విజయం సాధించిన తుది జట్టునే ఇంగ్లండ్ కొనసాగించే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వ్యక్తిగత కారణాలతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో మూడో స్థానంలో ఆడేందుకు క్రాలీకి అవకాశం లభిస్తే రూట్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. స్టోక్స్ ఎలాగూ తొలి టెస్టులో పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గానే ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వుడ్ గాయంనుంచి కోలుకోలేదు కాబట్టి అండర్సన్, ఆర్చర్, బ్రాడ్ కొనసాగడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇంగ్లండ్ ప్రధానంగా తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అదృష్టవశాత్తూ గత టెస్టు నెగ్గినా జట్టు బ్యాటింగ్ పేలవంగా ఉంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. స్టోక్స్ లేని లోటు కచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇతర బ్యాట్స్‌మెన్‌పై బాధ్యత పెరిగింది. వోక్స్, బట్లర్ తమ విలువను గత మ్యాచ్‌లో చూపించారు. అయితే అన్నింటికి మించి అండర్సన్ ఫామ్‌పై జట్టు ఆందోళనతో ఉంది. తొలి టెస్టులో అతను 97 పరుగులిచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు విండీస్‌తో కూడా అతను విఫలమయ్యాడు. అండర్సన్ చెలరేగితే ఇంగ్లండ్‌కు తిరుగుండదు. ఆదుకునేవారేరీ... గత కొన్నేళ్లలో పాకిస్తాన్ జట్టు గెలిచిన కొన్ని మ్యాచ్‌లు కూడా బౌలింగ్ బలగంతో వచ్చినవే. తొలి టెస్టులో కూడా జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. కుర్ర పేసర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్బాస్‌లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ వల్ల కాలేదు. ఇప్పుడు కూడా వారు అదే జోరు ప్రదర్శించగలరని టీమ్ మేనేజ్మెంట్ నమ్ముతోంది. పిచ్ కూడా పేస్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ విభాగంలో పాక్‌కు తిరుగు లేదు. ప్రధాన స్పిన్నర్‌గా యాసిర్ షాకు చోటు ఖాయం కాగా... రెండో స్పిన్నర్‌గా ఆడిన షాదాబ్ ఖాన్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించాలని టీమ్ భావిస్తోంది. అదే జరిగితే ఫవాద్ ఆలమ్ లేదా సొహైల్ ఖాన్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఎవరు వచ్చినా పాక్ బ్యాటింగ్ ఎప్పుడూ బలహీనంగానే కనిపిస్తోంది. అదే ప్రత్యర్థికి వరంగా మారుతోంది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిలకడగా ఆడి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. షాన్ మసూద్ తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడినా రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. టాప్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్నుంచి అతని స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. టెస్టు స్పెషలిస్ట్‌లు అజహర్ అలీ, అసద్ షఫీఖ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. నిజానికి మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మంచి అవకాశం ముందున్న దశలో పాక్ బ్యాట్స్‌మెన్ కొంతైనా సంయమనంతో ఆడి కనీసం 250 పరుగులు చేసినా మ్యాచ్ కచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ జట్టు 169 పరుగులకే కుప్పకూలి ఇంగ్లండ్‌కు అవకాశం ఇచ్చింది. చివరగా... అజహర్ అలీ కెప్టెన్సీకి ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. గత మ్యాచ్‌లో విఫల వ్యూహాలతో విమర్శలు ఎదుర్కొన్న అజహర్... ఇక సిరీస్ కోల్పోతే కెప్టెన్సీని కూడా చేజార్చుకునే అవకాశం ఉంది. -
అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే
సౌతాంప్టన్ : కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌తో క్రికెట్ సందడి షురూ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భౌతిక దూరం పాటిస్తూనే సహచర ఆటగాళ్లతో కేవలం భూజాలతోనే విషెస్ చెప్పడం చూశాం. అండర్సన్ చేసిన పని క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది. అలాగే ఇతర క్రికెటర్లు కూడా ఈ విధంగా పాటిస్తే బాగుంటుందని ఐసీసీ పేర్కొంది.(అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి) అలా అందరిచేత మెప్పించబడ్డ అండర్సన్ తాజాగా సౌతాంప్టన్‌లో వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ 3వరోజు ఆటలో భాగంగా ఐసీసీ నిబంధనలను గాలికొదిలేశాడు. రోస్టన్ చేజ్ వికెట్ తీసిన ఆనందంలో కనీస భౌతిక దూరం పాటించకుండా సహచరుల వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతి చేజ్ మొకాళ్లకు తాకుతూ వెళ్లింది. దాంతో అండర్సన్ ఎల్బీ అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్కు వెళ్లాడు. డీఆర్ఎస్ రివ్యూ ఇంగ్లండ్‌కు అనుకూలంగా రావడంతో ఆ సంతోషంలో అండర్సన్ తన సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లి ఆనందంతో హత్తుకున్నాడు.('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు') Jimmy makes the breakthrough! 👏 Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WS — England Cricket (@englandcricket) July 10, 2020 'అండర్సన్.. మొన్ననే కదా నిన్ను మెచ్చుకుంది.. ఇంతలోనే ఐసీసీ నిబంధనలు గాలికొదిలేస్తావా' అంటూ ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ స్పందించాడు. 'వికెట్ తీశానన్న ఆనందంలో అలా చేసి ఉంటాడు. ఎంతైనా పాత పద్దతులు అంత తొందరగా జీర్ణం కావుగా' అంటూ తెలిపాడు. కాగా తొలి టెస్టులో ఇప్పటివరకైతే విండీస్‌దే పైచేయిగా నిలిచింది. మూడోరోజూ ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో విండీస్ ఆధిక్యం దక్కింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్ కీపర్ డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది. -
వరుణుడే ఆడుకున్నాడు
వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్‌గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్‌ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది. సౌతాంప్టన్: సీజన్‌కు తగినట్లుగానే ఇంగ్లండ్‌లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది. రెండో ఓవర్లోనే... సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు. మళ్లీ మళ్లీ... తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు. బ్రాడ్ అవుట్... ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మోకాళ్లపై కూర్చోని... అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. రూట్‌కు రెండో అబ్బాయి... ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్‌కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. -
డబ్బులు వద్దు... భారత్‌తో టెస్టును చూస్తాం!
సౌతాంప్టన్: ఏడాది తర్వాత జరిగే భారత్– ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పాత షెడ్యూల్ ప్రకారం ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య గురువారంనుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. తొలి నాలుగు రోజుల టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే ఇప్పు డు ఈ మ్యాచ్ వేదికను సౌతాంప్టన్‌కు మార్చారు. దాంతో టికెట్ డబ్బులు వంద శాతం వాపస్ ఇవ్వాలా...లేక వచ్చే ఏడాది ఇక్కడ జరి గే భారత్–ఇంగ్లండ్ టెస్టు కోసం వాటిని అలాగే అట్టిపెట్టాలా అని ఫ్యాన్స్‌ను కోరింది. వీరిలో 85 శాతం మంది తమకు డబ్బులు వద్దు, సంవత్సరం తర్వాతైనా సరే మ్యాచ్ చూసేందుకు వస్తాం అంటూ అంగీకారాన్ని తెలియజేయడం విశేషం. ఇంగ్లండ్‌లో టెస్టు క్రికెట్‌కు ఉండే ఆదరణ ఎలాంటిదో ఇది చూపిస్తోంది. (అందుకే సోషల్ మీడియాకు ధోని దూరంగా!) -
కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్!
సౌతాంప్టన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ కోహ్లి కెప్టెన్సీ బాగా చేశాడని ప్రశంసలతో ముంచెత్తాడు. కీలక సమయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో డాట్‌బాల్స్ వేయించి ఫలితం రాబట్టాడని తెలిపాడు. ఫీల్డింగ్ కూడా బాగా పెట్టాడని ప్రశంసించాడు. అటు బ్యాట్‌తోనూ కీలకమైన 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లి బాడీ లాంగ్వేజ్, ఫుట్‌వర్క్ ఆకట్టుకుందన్నాడు. అలాగే ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో ధోని-కేదార్ జాదవ్‌లు నెమ్మదైన భాగస్వామ్యంతో విసుగెత్తించారని విమర్శించాడు. శనివారం జరిగిన మ్యాచ్ చూస్తే తనకు 2003 ప్రపంచకప్‌లో హాలండ్‌తో జరిగిన మ్యాచ్ గుర్తుకు వచ్చిందని తెలిపాడు. అప్పుడు ఇలాగే తక్కువ పరుగులే చేశామని, కానీ బౌలర్ల చొరవతోనే విజయం సాధించగలిగామని గుర్తుకు తెచ్చుకున్నాడు. నెమ్మదైన పిచ్‌పై అఫ్గాన్ క్రికెటర్లు అటు మొదట బౌలింగ్‌లోనూ, తర్వాత బ్యాట్‌తోనూ అదరగొట్టి భారత్‌కు ముచ్చెమటలు పట్టించారని సచిన్ చెప్పుకొచ్చాడు. షమీకి ముందే చెప్పా.. టీమిండియా పేసర్, హ్యాట్రిక్ హీరో మహ్మద్ షమీకి త్వరలోనే మంచి టైం వస్తుందని ముందే చెప్పానని సచిన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో షమీ హ్యాట్రిక్‌తో ఔరా అనిపించిన విషయం తెలిసిందే. ఈ మెగాఈవెంట్లో ఈ ఘనతనందుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచిన షమీ.. ఓవరాల్‌గా 10వ బౌలర్‌గా గుర్తింపుపొందాడు. షమీ అద్భుత ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ.. ‘త్వరలోనే నీదైనా టైం వస్తుంది. తుది జట్టులో అవకాశం లభిస్తుందని షమీకి చెప్పాను. అంటే భువనేశ్వర్‌కు గాయం కావాలనేది నా ఉద్దేశం కాదు. సంసిద్ధంగా ఉండని మాత్రం షమీకి చెప్పాను. దురదృష్టవశాత్తు భువీ గాయంతో వైదొలగడం.. షమీకి అవకాశం రావడం అలా జరిగిపోయింది. షమీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు గంటకు 140 కిలోమీటర్ల వేగం తగ్గకుండా వేసాడు’ అని కొనియాడాడు. షమీ అద్భుత ప్రదర్శనను యావత్ క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తొలి నాలుగు మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కని షమీకి.. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ గాయపడటంతో అప్గాన్ మ్యాచ్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. -
అఫ్గానిస్తాన్ లక్ష్యం 225
-
టీమిండియా తడ‘బ్యాటు’.. అఫ్గాన్ లక్ష్యం 225
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లి(67), కేదార్ జాదవ్(52)లు హాఫ్ సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్(30), విజయ్ శంకర్(29), ఎంఎస్ ధోని(28)లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ(1) నిరాశపరచడంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది యత్నం చేసింది. ఈ జోడి 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్ శంకర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఫలితంగా 122 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో కోహ్లి సైతం ఔట్ అయ్యాడు. కాగా, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్‌లు కాస్త ప్రతిఘటించడంతో భారత్ తేరుకుంది. ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత ధోని ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి హార్దిక్ పాండ్యా(7) కూడా పెవిలియన్ చేరగా, షమీ(1) కూడా వెంటనే ఔటయ్యాడు. ఇక కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చివరి ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. దాంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత ఆటగాళ్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, రహ్మత్ షా, ముజీబ్ ఉర్ రహ్మాన్, అఫ్తాబ్ అలామ్‌లకు వికెట్ చొప్పున లభించింది. -
రెచ్చిపోతారనుకుంటే.. తడబడుతున్నారు!
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రెచ్చిపోవడం ఖాయమని సగటు క్రీడాభిమాని ఊహించుకుని ఉంటాడు. అయితే మ్యాచ్ ఆరంభమైన తర్వాత మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. భారత జట్టు కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని కుదురుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. 135 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి బ్యాటింగ్‌లో తడబాటుకు గురైంది. భారత్ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లలో రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(30), విజయ్ శంకర్(29), విరాట్ కోహ్లి(67)లు ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది యత్నం చేసింది. ఈ జోడి 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్ శంకర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఫలితంగా 122 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో కోహ్లి సైతం ఔట్ కావడంతో భారత్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఇక మిగతా వారు సాధ్యమైనంత వరకూ క్రీజ్‌లో ఉండి స్టైక్ రోటేట్ చేస్తేనే భారత్ పోరాడే లక్ష్యాన్ని అఫ్గాన్ ముందు ఉంచకల్గుతుంది. 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. -
రోహిత్ శర్మ విఫలం
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కేవలం పరుగు మాత్రమే చేసిన రోహిత్ పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను రోహిత్, కేఎల్ రాహుల్‌లు ఆరంభించారు. కాగా, అఫ్గానిస్తాన్ తొలి ఓవర్‌ను స్పిన్‌తో ప్రారంభించింది. స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌తో అఫ్గాన్ మొదటి ఓవర్‌ను వేయించింది. అయితే ముజీబ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఆడిన రోహిత్ పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించిన రోహిత్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో విఫలం కావడం భారత అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.