WTC ఫైనల్‌: నాలుగో రోజు వర్షార్పణం | Wtc 2021 Final Day 4 Match Abandoned Due To Rain India New Zealand | Sakshi
Sakshi News home page

WTC ఫైనల్‌: నాలుగో రోజు వర్షార్పణం

Published Mon, Jun 21 2021 7:41 PM | Last Updated on Mon, Jun 21 2021 8:23 PM

Wtc 2021 Final Day 4 Match Abandoned Due Rain India New Zealand - Sakshi

సౌతాంఫ్టన్‌: ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ పైనల్‌కు వరుణుడు అడ్డంగా మారాడు. ఇక నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభమవుతుందని ఆశించిన ప్రేక్షకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ మెగా ఫైనల్‌కు వేదికైన సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి వర్షం కురవడంతో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచిపోయింది.

దీంతో పాటు ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే నాల్గో రోజు మ్యాచ్‌ జరిగే సూచనలు లేవని ఫీల్డ్‌ ఎంపైర్లు తెలపడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా నాలుగో రోజు ఆట వర్షార్పణం అయ్యింది. 

చదవండి: WTC ఫైనల్‌: విరాట్ కోహ్లి డ్యాన్స్‌ అదిరిందిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement