
లండన్: పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే చాలు అన్నీ మటుమాయం. కానీ చాలామంది కాఫీలో కెఫిన్ వంటి ఆల్కాలాయిడ్ ఉండటంతో ప్రమాదకరమనే భయంతో కాఫీ తాగడం మానేస్తున్నారు. అయితే ప్రతిరోజూ మూడు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల ముప్పు లేదని, పైగా జీవితకాలం పెరుగుతుందని బ్రిటన్‌కు చెందిన సౌత్ ఆంప్టన్ వర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. అంతేకాకుండా గుండెపోటుతో పాటు క్యాన్సర్, మధుమేహం, కాలేయ సంబంధిత ప్రమాదకర వ్యాధులను నివారిస్తుందని పరిశోధకులు తెలిపారు.
దీనికి కారణం కాఫీ చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండటమేనని వారు తెలిపారు. అయితే గర్భిణులు కాఫీ తాగడం ప్రమాదకరమట. అయితే కేవలం 201 పరిశోధక పత్రాలను మాత్రమే తాము పరిశీలించామని, కాఫీ వల్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందా.. లేక అనారోగ్యాన్ని కొనితెస్తుందా... అనే విషయంపై పూర్తి స్పష్టత ఇవ్వలేకపోయారు.