సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేయాలని భావిస్తోంది. బుధవారం సౌతాంప్టాన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు.
ఇక ప్రపంచ కప్‌లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. అయితే తాజా వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీలకు నిరాశే ఎదురైంది. వారికిది మూడో మ్యాచ్. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్ నెగ్గితేనే కానీ కప్‌లో ముందుకెళ్లలేరు. గత మ్యాచ్ ప్రారంభంలోనే ఎన్‌గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్ స్టెయిన్ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్ బౌలర్లున్నారు. బ్యాటింగ్ విభాగంలో డీకాక్, డుప్లెసిస్, హషీమ్ ఆమ్లాలు వారికి ప్రధాన బలం.
మరోవైపు తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్‌తో భారత్ బల ప్రదర్శనకు దిగుతోంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో పాటు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లతో జట్టు బ్యాటింగ్ బలంగా కనబడుతోంది. ఇక పేస్, స్పిన్ విభాగాల్లో భారత సమతూకంగా ఉంది. ఈ పిచ్ స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో తుది జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కింది. స్పిన్ విషయానికొస్తే కుల్దీప్ యాదవ్, చహల్‌లకు అవకాశం కల్పించారు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా
డుప్లెసిస్(కెప్టెన్), డీకాక్, హషీమ్ ఆమ్లా, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, ఫెహ్లుక్వోయా, క్రిస్ మోరిస్, కగిసో రబడా, ఇమ్రాన్ తాహీర్, తాబ్రాయిజ్ షంసీ
భారత్
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment