WTC Final Day 3: ముగిసిన మూడో రోజు ఆట | Wtc Final Day 3 India Vs New Zealand Test Match Live Updates | Sakshi
Sakshi News home page

WTC Final Day 3: కివీస్‌ స్కోరు- 101/2

Published Sun, Jun 20 2021 3:30 PM | Last Updated on Mon, Jun 21 2021 12:15 AM

Wtc Final Day 3 India Vs New Zealand Test Match Live Updates - Sakshi

సౌతాంప్టన్‌: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. అయితే, వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ కుదర్లేదు.

ఇక మూడో రోజైన ఆదివారం ఆట పూర్తిగా కొనసాగించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఎందుకంటే  సౌతాంప్టన్‌ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఈ కారణంగా మూడో రోజు సైతం మ్యాచ్‌ రోజంతా సజావుగా జరగడం కష్టమేనని బ్రిటీష్‌ వాతావరణ శాఖ తెలిపిన నివేదికలు చెప్తున్నాయి. అవుట్‌ ఫీల్డ్‌ తడిగా కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభమైంది.

అప్‌డేట్స్‌:

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (12), రాస్‌ టేలర్‌ (0) ఉన్నారు.
కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్‌ ఆటగాడు లాథం (30) పరుగుల చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం కివీస్‌ స్కోరు: 90/ 1 ( 42 ఓవర్లు)..
కాగా క్రీజులో కేన్‌ విలియమ్‌సన్‌ ( 11 ), కాన్వే ( 46 ) ఉన్నారు.

కివీస్‌ ఓపనర్లు నిలకడగా.. 
►ప్రతిషాత్మక మ్యాచ్‌లో భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడమే కాకుండా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఓపనర్లు నిలకడగా ఆడుతున్నారు. లాథమ్‌ ( 17) , కాన్వే ( 18 ) రాణించడంతో.. టీ బ్రేక్‌ సమయానికి 21 ఓవర్లలో కివీస్‌ జట్టు స్కోరు 36/ 0 గా ఉంది.   

తొలి ఇన్నింగ్స్‌: టీమిండియా 217 పరుగులకు ఆలౌట్‌
► న్యూజీలాండ్‌ బౌలర్ల ధాటికి భారత​ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో 217 పరుగులకే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ముగించేసింది. 
► భారత బ్యాట్స్‌మెన్లు.. రహానె (49), కోహ్లీ (44), రోహిత్‌ (34), గిల్‌ (28) స్కోరు చేశారు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌లో.. జేమిసన్‌కు 5, బౌల్ట్‌, వాగ్నర్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.
► ఇషాంత్‌ ( 4) , బుమ్రా, షమీ క్రీజులోకి రాగానే వికేట్‌ సమర్పించుకున్నారు. కాగా జడేజా 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
►ప్రస్తుతం టీమిండియా స్కోరు - 211/ 7 (89 ఓవర్లు).
► క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ ( 27 బంతులల్లో 22, 3*4 ) బ్యాట్‌తో పరుగులు రాబట్టినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దీంతో 205 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా అశ్విన్‌ వెనుదిరిగాడు. 
►  క్రీజులో జడేజా ( 10 ), అశ్విన్‌ ఉన్నారు. టీమిండియా స్కోరు-182 /6 ( 82 ఓవర్లు )
► క్రీజులోకి వచ్చిన జడేజా రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ పై ఆశలు రేపిన, రహానే రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా రహానే ( 117బంతుల్లో 49,  5*4 ) అర్థ సెంచరీని ఒక్క పరుగు తేడాతో చేజార్చుకున్నాడు.  
► క్రీజులో రవీంద్ర జడేజా ( 6), రహానే ( 42 ) ఉన్నారు. టీమిండియా స్కోరు -171/5  ( 77.2 ఓవర్లలో)

నాలుగు పరుగులు.. ఐదో వికెట్‌గా పంత్‌ పెవిలియన్‌కు చేరాడు


►క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌ కేవలం నాలుగు పరుగులకే ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. పంత్‌ ( 22 బంతుల్లో 4, 1*4 ) చేసి జెమీసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్‌ తక్కువ స్కోరుకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

భారీ స్కోరుకు బ్రేక్‌.. విరాట్‌ వికెట్‌ డౌన్‌ 

►మూడో రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైన కాసేపటికే నాలుగో వికెట్‌ రూపంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (132 బంతుల్లో 44, 1x4) పెవిలియన్‌ చేరాడు. దీంతో విరాట్‌ కోల్పోవడంతో భారత్‌కు పెద్ద దెబ్బే తగిలింది.  ప్రస్తుతం రిషభ్‌ పంత్‌, రహానే (32) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 68 ఓవర్లలో 149/4.

మ్యాచ్‌పై పట్టు కోసం.. భారీ భాగస్వామ్యం కావాల్సిందే

► రెండో రోజు ఆట ముగిసే సమయానకి టీమిండియా స్కోరు..  64.4 ఓవర్లలో 146/3. కోహ్లి (44 పరుగులు), రహానే (29) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్‌గా రోహిత్‌ శర్మ (34; 68 బంతుల్లో 6×4), రెండో వికెట్‌గా శుభ్‌మన్‌ గిల్‌ (28; 64 బంతుల్లో 3×4), మూడో వికెట్‌గా చతేశ్వర్‌ పుజారా (8) వెనుదిరిగారు.
చదవండి: WTC Final: కివీస్‌కు ఫీల్డ్‌ అంపైర్ సాయం‌.. ఫ్యాన్స్‌ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement