
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6), ఫస్ట్ డౌన్ ఆటగాడు మర్కరమ్(5) వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఆమ్లా, డీకాక్‌లు ఆరంభించారు. కాగా, కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఐదో బంతికి ఆమ్లా స్లిప్‌లో గేల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన మర్కరమ్ కీపర్ షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కాట్రెల్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి మర్కరమ్ బంతిని లెగ్ సైడ్‌కు ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో మర్కరమ్ భారంగా పెవిలియన్ వీడాడు. దాంతో సఫారీలు 28 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయారు. ఇప్పటికే వరుస మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు విండీస్ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే వారు సెమీస్ రేసులో నిలుస్తారు. మరొకవైపు ఒక మ్యాచ్‌లో గెలిచి, మరొక మ్యాచ్‌లో విండీస్‌కు ఇది మూడో లీగ్ మ్యాచ్. ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్ ద్వారా విజయాల పట్టాలని కరీబియన్లు భావిస్తున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరుగుతున‍్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్గించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 7.3 ఓవర్ల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment