మెమరీ క్రిస్టల్‌లో మన జన్యుక్రమం | British scientists preserve human genome on 5D memory | Sakshi
Sakshi News home page

మెమరీ క్రిస్టల్‌లో మన జన్యుక్రమం

Published Sun, Sep 22 2024 1:53 AM | Last Updated on Sun, Sep 22 2024 1:53 AM

British scientists preserve human genome on 5D memory

వందల కోట్ల ఏళ్లు చెక్కుచెదరదు 

మానవాళి అంతరిస్తే పునఃసృష్టికి వీలు 

లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్‌ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్‌ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. 

మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్‌లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్‌ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్‌ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! 

గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్‌ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్‌ అత్యంత మన్నికైన డిజిటల్‌ స్టోరేజ్‌ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్‌ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్‌ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 

5డి మెమరీ ఎందుకంటే... 
అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్‌లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్‌) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్‌ పీటర్‌ కజాన్‌స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. 

కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్‌ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్‌లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్‌స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్‌ మ్యాన్‌కైండ్‌ ఆరై్కవ్‌’ టైమ్‌ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో డీఎన్‌ఏ స్టోరేజ్‌ విభాగాధిపతి థామస్‌ హెయ్‌నిస్‌ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement