Crystal
-
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
28 లక్షల ఖరీదైన కుర్చీని చూస్తారా?
రత్నఖచిత సింహాసనాలు కొత్తకాదు. బంగారం లేదా వెండితో తయారు చేసిన సింహాసనాలకు రకరకాల రత్నాలను పొదిగి తీర్చిదిద్దడమూ కొత్తకాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏకరత్న సింహాసనం. భారీ పరిమాణంలోని అమెథిస్ట్ రత్నంతో దీనిని తయారు చేశారు. ఇందులో కుర్చుంటే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట! ఎందుకంటే, ఈ కుర్చీని జ్యోతిశ్శాస్త్ర నిపుణుల ప్రకారం, శని దోషాలను నివారించే అమెథిస్ట్ రత్నంతో తయారు చేశారు. ‘ఒక చిన్న రాయిని తెచ్చుకొని ఇంట్లోనో లేక ఆభరణాల్లో పొదిగించుకుని పెట్టుకునే కంటే, ఆ రాతి మీదే కూర్చుంటే ఇంకెంత లాభం వస్తుంది!’ అని చెప్పారు. జపాన్‌కు చెందిన ఫ్యాక్టరీ–ఎమ్ అధినేత కొయిచి హసెగావా ఇంగ్లిష్ అక్షరం ‘ఎల్’ ఆకారంలో ఉండే పెద్ద అమెథిస్ట్ రాతిని లోహంతో బిగించి ఈ కుర్చీని తయారు చేశారు. కుర్చీ మొత్తం బరువు 99 కేజీలు ఉంటే, దీనిలో పొదిగిన రాయి బరువే 88 కేజీలు. దీని ధర కూడా అంతే భారీగా ఉంటుంది. రూ. 28 లక్షలు పెట్టి కొన్నప్పటికీ.. ఈ కుర్చీలో కనీసం పది నిమిషాలు కూడా కూర్చోలేము. ఈ రాతిని అరకొరగా మాత్రమే సానపెట్టారు. అందువల్ల దీని ఉపరితలం గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటుంది. కాబట్టి, దీనిపై కూర్చోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే, ఇలాంటి కుర్చీని మీరు కూడా తయారు చేయించుకోండి. 本当に座れるアメジスト椅子を製作したので見てください☺️✨ pic.twitter.com/whnsW2mwDF — factory-M (@factory___m) December 18, 2022 -
ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి
కాల్సైట్ స్పటికాల సముహాలతో నిండి... ఫిరింగి పరిమాణంలో ఉన్న డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి చైనాలో అన్హుయ్ ప్రావిన్స్‌లోని కియాన్షాన్లో గుర్తించారు. ఇవి రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లని, క్రెటేషియస్ కాలం నాటివిగా పేర్కొన్నారు. అంతేగాదు ఇవి డైనోసార్ల యుగంలో చివరి కాలంనాటివిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లలోనే ఇవి ఒక కొత్త జాతిగా భావిస్తున్నారు. ఎందుకంటే గుడ్ల పరిమాణం, షెల్ యూనిట్, గట్టి అమరిక, ప్రత్యేకమైన గోళాకార ఆకృతి తదితరాలను బట్టి పాలియోంటాలజిస్టులు డైనోసార్లలో కొత్త జాతికి చెందినవిగా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ గుడ్లలో ఒకటి సరిగా సంరక్షించబడలేదని చెప్పారు. అందువల్లే వాటి అంతర్గత సముహాల్లో కాల్సైట్ స్పటికాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇవి దాదాపు గోళాకారంగా ఉండి, పొడవు 4.1 అంగుళాలు నుంచి 5.3 అంగుళాల మధ్య, వెడల్పు 3.8 అంగుళాల నుంచి 5.2 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ డైనోసార్లు చిన్నచిన్న మొక్కలను ఆహారంగా తినే బైపెడల్ డైనోసార్లగా శాస్తవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్ దృశ్యాలు వైరల్) -
ఇదో ‘అమెజాన్ అడవి’
ప్రపంచంలో అతి పెద్ద అడవులంటే... అమెజాన్ అని మనకు తెలుసు. కానీ వర్జీనియా నగరంలో మరో ‘అమెజాన్ అడవి’ నిర్మితమవుతోంది. నగరంలో అడవి ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అది ఓ అడవిలాంటి భవనం. దానిని నిర్మిస్తున్నది రీటైల్ దిగ్గజం ‘అమెజాన్’. ఆ భవనం వివరాలేంటో తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణలోనే కాదు... తమ కార్యాలయాల నిర్మాణంలోనూ ప్రత్యేకతను చాటు కునే సంస్థ అమెజాన్. హైదరాబాద్‌లో ఉన్న ఇంద్ర భవనంలాంటి ఆఫీసే అందుకు తార్కాణం. ఇదే ఇలా ఉందంటే.. సియాటిల్‌లో తన ప్రధాన కార్యా లయం ఎలా ఉండాలి? మూడు గోళాకార భవనా లను పారదర్శకంగా నిర్మించింది. వీటిని పర్యావ రణ హితంగా రూపొందించింది. ఇప్పుడు తన రెండో హెడ్‌క్వార్టర్స్ నిర్మాణంలోనూ అదే ప్రత్యేక తను చాటబోతోంది. వర్జీనియాలోని అర్లింగ్టన్ కౌంటీని ఇందుకు వేదికగా చేసుకుంది. నగరం నడిబొడ్డున ఎత్తైన పర్వతం, దాని చుట్టూరా పచ్చని చెట్లతో కూడిన అడవిలాంటి భవనాన్ని నిర్మించ నుంది. ఇందుకోసం గతంలో తమ భవనాలను నిర్మించిన ఎన్బీబీజే సంస్థనే ఎనుకున్నది. మన రాష్ట్ర బడ్జెట్‌కు సమానం... క్రిస్టల్ సిటీగా పేరుగాంచిన వర్జీనియా నగరంలో అమెజాన్... 350 అడుగుల ఎత్తైన భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల నుంచి ప్లానింగ్ అనుమతులు కూడా పొందింది. ఆ భవనం కట్టేందుకు 2.5బిలియన్ డాలర్ల (దాదాపు రెండు లక్షల కోట్లు)వ్యయం ఖర్చు చేయనుంది. అంటే దాదాపు మన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమాన మన్నమాట. 25వేల మంది ఉద్యోగులు పనిచేసేం దుకు వీలుగా 22 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తు న్నారు. ఇందులో ప్రత్యేకమైన పార్క్, కమ్యూనిటీ హైస్కూల్, అనేక షాప్స్ కూడా ఏర్పాటవుతు న్నాయి. ఇక బయటినుంచి చూడటానికి గోపురం లా కనిపించే ఈ భవనం చుట్టూ ర్యాంప్... దానికి రువైపులా చెట్లతో నిజంగానే అడవిని తలపిం చనుంది. ర్యాంప్ మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ... భవనం పైవరకూ వెళ్లే వీలు కల్పించను న్నారు. ఈ అమెజాన్ అడవి భవనాన్ని ఎక్కాలంటే 2025 దాకా ఆగాల్సిందే. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఇది కేఎఫ్‌సీ చికెన్ కాదు సుమీ..
ఫొటో చూడగానే లొట్టలేయకండి.. కేఎఫ్‌సీ చికెన్ అని అస్సలు భ్రమపడకండి.. కన్నార్పకుండా చూస్తూ ఆకలి తెచ్చుకోకండి. ఇంతకీ అదేంటా! అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. అది కేవలం ఓ రాయి. అమేలియా రూడీ బ్రాస్లెట్ బిజినెస్ నిర్వహస్తుంది. ఇందుకోసం ఆమె రకరకాల రాళ్లు సేకరిస్తుంది. ఈ క్రమంలో రూడీకి తన స్నేహితురాలు ఓ రాయిని ఇచ్చింది. దాన్ని చూడగానే ఆమె ఒక్క క్షణం పాటు తత్తరపాటుకు లోనైంది. అది ఎంతో ప్రత్యేకంగా కనిపించడంతో రాయి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. (చికెన్, గుడ్లతో రోగనిరోధక శక్తి) హే.. చికెన్ అనుకుని నోట్లో ఊరిళ్లూరేలోపే దాని క్యాప్షన్ చదివి రాయి అని తెలుసుకుని ఉసూరుమంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఫొటోకు 2.8 లక్షల లైకులు రాగా వేలాది కామెంట్లు వచ్చి పడుతున్నాయి. చికెన్ ఫ్రైను పోలిన రాళ్ల ఫొటోను పలువురు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు చీజ్ కేక్, బంగాళాదుంప, మాంసాన్ని పోలిన రాళ్ల ఫొటోలు ప్రత్యక్షమై ఆహారప్రియులకు నోరూరించేలా చేస్తున్నాయి. (ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?) -
పరమపవిత్రం స్ఫటిక లింగం
సాక్షి, రాజాం : రాజాం పట్టణం అనగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది తాండ్ర పాపారాయుడు. రాజాం కేంద్రంగా బొబ్బిలి రాజుల ప్రతినిధిగా ఆయన పాలన సాగించేవారు. ఇదే సమయంలో అక్కడ ఆయన పలు ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఎక్కువుగా వైష్ణవ ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో ఆయన మాత్రం సారధిలోని కూరాకుల వీధిలో ప్రత్యేకంగా స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్టించారు. లోక కల్యాణార్థం అప్పట్లో ఆయన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచి్చన రాతితో నిర్మించినట్లు చెబుతారు. మరోవైపు ఈ ఆలయంలో గర్భగుడి కుడి, ఎడమ వైపునున్న గుడుల్లో గణేశుని ప్రతిమతతో పాటు పార్వతిదేవి ప్రతిమలు ఉత్తర, దక్షిణ ముఖంగా ఉంటాయి. ఇలా ఈ రెండు విగ్రహాలు ఉత్తర, దక్షిణ ముఖాలుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తాండ్ర పాపారాయుడు ప్రతిరోజు ఉదయం శివలింగ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసేవారని తెలుస్తోంది. ఈ శివలింగానికి నిష్టతో పూజచేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. -
స్ఫటికం
అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా కనిపించే స్ఫటికాలు సహజమైన మణుల జాతికి చెందుతాయి. ఆధ్యాత్మికంగా స్ఫటికం చాలా విశేషమైనది. స్ఫటికమాలలను జపమాలలుగా వినియోగించడం అందరికీ తెలిసిందే. లలిత, లక్ష్మీ ఆరాధన చేసేవారు స్ఫటికమాలను జపమాలగా వినియోగించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, వంశాభివృద్ధి, కుటుంబ శాంతి చేకూరుతాయి. స్ఫటికమాలను మెడలో ధరించినట్లయితే, మానసిక అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. స్ఫటికమాలను ధరించాలనుకునేవారు ఏదైనా శుక్రవారం రోజున తారాబలం చూసుకుని ధరించడం మంచిది. స్ఫటిక ధారణ వల్ల శుక్రగ్రహ దోషం వల్ల కలిగే వైవాహిక సమస్యలు సద్దుమణుగుతాయి. స్ఫటికాన్ని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా పరిగణిస్తారు. శివారాధన చేసేవారు స్ఫటిక శివలింగాన్ని ఆరాధించినట్లయితే శీఘ్ర ఫలితం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్ఫటిక శివలింగాన్ని ఎవరైనా ఏ వేళలోనైనా పూజించవచ్చు. దీనికి ఎలాంటి నిషేధాలూ లేవు. – పన్యాల జగన్నాథ దాసు -
ముంబైలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ నివాస సముదాయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దాదర్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ టవర్ అనే 17 అంతస్తుల భవనంలో ఉదయం 8.32 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో నలుగురు మరణించగా, 16 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 12వ అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా అంతస్తులకు దావానలంలా వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ కంట్రోల్ రూమ్‌కు సందేశం అందింది. సమాచారం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. లిఫ్టులు, మెట్లదారి నుంచి ప్రజలను కాపాడటం సురక్షితం కాదని భావించిన అధికారులు నిచ్చెనల సాయంతో వారిని కిందకు దించారు. ఇంకా కొంత మంది భవనంలోనే ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తం 10 ఫైరింజన్లు, 4వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు ఆర్పామని చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఆపదలో ఆదుకున్న చిన్నారి చిట్కాలు సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడున్న వారంతా భయంతో వణికిపోతారు.అదే అగ్ని ప్రమాదాల్లాంటివయితే చావు భయంతో తోపుళ్లు, తొక్కిసలాటలతో పరిస్థితి భయానకంగా మారుతుంది.అయితే, ముంబైలోని క్రిస్టల్ టవర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల అమ్మాయి ఎంతో ధైర్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడింది. జెన్ సదావర్తే అనే ఆ బాలిక అగ్ని ప్రమాదం కారణంగా వెలువడిన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారికి చిన్న చిట్కాతో ఉపశమనం కలిగించింది.పొగకు ఫ్లాట్లలోని జనమంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంటే జెన్ వాళ్లకి ధైర్యం చెప్పింది. తడి గుడ్డను ముక్కుకు కట్టుకుంటే పొగలోని కార్బన్‌డయాక్సెడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు.అని చెప్పింది. అంతే కాకుండా అందుబాటులో ఉన్న పాత బట్టల్ని తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా(జేబురుమాళ్ల సైజులో)చింపింది. వాటిని తడిపి అందరికీ ఇచ్చి ముక్కుకు కట్టుకోమని చెప్పింది. అంతా అలా చేసి కార్బన్ డయాక్సైడ్ బారి నుంచి బయటపడ్డారు. అలాగే, లిఫ్టులో కిందకి దిగకూడదంటూ వారిని వారించింది. తన దగ్గరున్న ఎయిర్ ప్యూరిఫయర్‌ను కూడా అందరికీ ఇచ్చింది.అలాగే అందరూ ఒకేసారి మెట్ల మీదుగా తోసుకుంటూ కిందకి వెళితే జరిగే ప్రమాదాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పింది. ఇవన్నీ విపత్తు నిర్వహణకు సంబంధించి తన స్కూల్లో చేసిన ప్రాజెక్టు వల్ల నేర్చుకున్నానని తరువాత మీడియాకు తెలిపింది. -
మిస్ స్నేహశీల
అందం దేవుడిస్తాడు. సుగుణాలు తల్లిదండ్రులిస్తారు. కాని మంచి పనులు చేయాలనే స్ఫూర్తి మాత్రం మనమే వృద్ధి చేసుకోవాలి. అలాంటి స్ఫూర్తి కావాలంటే అందానికి మించిన సంస్కారం ఉండాలి. క్రిస్టల్ అలాంటి సంస్కారం ఉన్న అమ్మాయి. అందుకే తన సంస్కారం, స్నేహశీలతకు నిదర్శనంగా అమెరికాలో ఇటీవల జరిగిన ‘మిస్ కంజీనియాలిటీ’ కాంటెస్ట్‌లో ‘మిస్ టీన్ కంజీనియాలిటీ’ గా గెలుపొందింది. క్రిస్టల్ పూర్తిపేరు క్రిస్టల్ ఫేవరిటో. వయసు 14. జార్జియాలోని అట్లాంటాలో నైన్త్ గ్రేడ్ చదువుతోంది. సెంటెనియల్ హైస్కూల్ స్టూడెంట్. కథక్ డ్యాన్సర్ కూడా. ఈ టాలెంట్ ఈవెంట్లో కథక్కే క్రిస్టల్ లక్ అయింది! క్రిస్టల్ ‘మిస్ టీన్ కంజీనియాలిటీ’ మాత్రమే కాదు, ‘మిస్ టీన్ ఇండియా యు.ఎస్.ఎ.’ ఫస్ట్ రన్నరప్ కూడా! న్యూరో సర్జన్ అవడం క్రిస్టల్ లక్ష్యం. ఇంకా చాలా అశలున్నాయి. పెద్ద మోడల్ అవాలనీ; ఫిల్మ్, ఫ్యాషన్ ఇండస్ట్రీలను ఏలాలనీ! అక్కడితో అయిపోలేదు. బాలికల చదువుకు తన వైపు నుంచి ఏమైనా చెయ్యాలని అమె అనుకుంటోంది. ఈ వేసవికి డొమినికన్ రిపబ్లిక్లో పాఠశాలలను నిర్మించడానికి తన స్కూలు తరఫున వెళుతోంది. జార్జియా రాష్ట్రం నుంచి ‘మిస్ టీన్ ఇండియా’ టైటిల్ గెలుచుకుని, ‘మిస్ ఇండియా యు.ఎస్.ఎ.–టీన్స్’ ఫైనల్స్‌కు చేరుకుంది క్రిస్టల్. ఈ పోటీలు న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌లో డిసెంబర్ 16–18 మధ్య జరిగాయి. రియా మంజ్రీకర్ టైటిల్ గెలిచింది. సెకండ్ రన్నరప్ ఈషా కోడెకు దక్కింది. ఫస్ట్ రన్నరప్ క్రిస్టల్. ఆరేళ్లుగా నేర్చుకుంటున్న కథక్నీ, లేటెస్ట్ బాలీవుడ్ సాంగ్‌నీ (ప్రేమ్ రతన్ ధన్ పాయో) కలిపి ‘టాలెంట్’ కేటగిరీలో ప్రదర్శించి, జడ్జీలను మంత్రముగ్ధుల్ని చేసింది క్రిస్టల్. డాన్స్‌లో కుముద్ సావ్లా, ముంజుల నేర్పిన మెళకువలు అవి. ఎన్నారైలు డాక్టర్ జి.ఎస్.విజయగౌరి, జి.గౌరీశంకర్ల మేనకోడలు క్రిస్టల్. తల్లి విజయలక్ష్మి. పోటీలకు జడ్జిలుగా వందనశర్మ, లలిత్ కె.ఝా, దీపక్ చోప్రా, రుచి ప్రసాద్, అలేషా మిల్స్ వ్యవహరించారు. - టీన్ బ్యూటీ -
రంగురంగుల రాళ్ల గాజులు!
ఒకే రంగులో ఉన్న గాజులు వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. రంగు రంగుల రాళ్లు (క్రిస్టల్స్) ఉండే బ్యాంగిల్స్ నయా ఫ్యాషన్! వాటిని మనకు మనమే తయారు చేయడం నేర్చుకుందామా! కావలసినవి: గోల్డ్ కలర్ తీగ (మందంగా ఉండాలి), గాజు గ్లాసు (మీ బ్యాంగిల్ సైజుకు తగ్గట్టుగా), వివిధ రంగుల క్రిస్టల్స్ లేదా బీడ్స్, వైర్ కట్టర్, పట్టకారు తయారీ విధానం: ముందుగా వైరును గాజు గ్లాసుకు గుండ్రంగా చుట్టాలి. ఎన్ని చుట్లు కావాలన్నది మీ ఇష్టం. వాటి చివర్లను పట్టకారు సాయంతో గట్టిగా తిప్పాలి. జాగ్రత్తగా ముడివేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా వైరును కట్టర్ సాయంతో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వైరు ముక్కతో బీడ్ని కానీ క్రిస్టల్‌ను కానీ తీసుకొని, ముందుగా చుట్టి పక్కన పెట్టుకున్న తీగకు ఫొటోలో చూపించిన విధంగా అమర్చాలి. వాటి చివర్లను కూడా పట్టకారు సాయంతో ముడి వేయాలి. అలాగే మరో క్రిస్టల్నూ యాడ్ చేసుకోవాలి. అలా ఒక్క గాజుకు రెండు, మూడు క్రిస్టల్స్‌ను పెట్టుకోవచ్చు. కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. కాంబినేషన్‌స జాగ్రత్తగా ఎంచుకుంటే చాలు. ఇవి బ్యాంగిల్స్లానే కాదు, బ్రేస్లెట్స్లా కూడా అనిపిస్తాయి!