
అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా కనిపించే స్ఫటికాలు సహజమైన మణుల జాతికి చెందుతాయి. ఆధ్యాత్మికంగా స్ఫటికం చాలా విశేషమైనది. స్ఫటికమాలలను జపమాలలుగా వినియోగించడం అందరికీ తెలిసిందే. లలిత, లక్ష్మీ ఆరాధన చేసేవారు స్ఫటికమాలను జపమాలగా వినియోగించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, వంశాభివృద్ధి, కుటుంబ శాంతి చేకూరుతాయి.
స్ఫటికమాలను మెడలో ధరించినట్లయితే, మానసిక అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. స్ఫటికమాలను ధరించాలనుకునేవారు ఏదైనా శుక్రవారం రోజున తారాబలం చూసుకుని ధరించడం మంచిది. స్ఫటిక ధారణ వల్ల శుక్రగ్రహ దోషం వల్ల కలిగే వైవాహిక సమస్యలు సద్దుమణుగుతాయి.
స్ఫటికాన్ని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా పరిగణిస్తారు. శివారాధన చేసేవారు స్ఫటిక శివలింగాన్ని ఆరాధించినట్లయితే శీఘ్ర ఫలితం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్ఫటిక శివలింగాన్ని ఎవరైనా ఏ వేళలోనైనా పూజించవచ్చు. దీనికి ఎలాంటి నిషేధాలూ లేవు.
– పన్యాల జగన్నాథ దాసు
Comments
Please login to add a commentAdd a comment