వెస్టిండీస్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. విధ్వంస‌క‌ర ఆట‌గాడు దూరం | West Indies announces 15-member squad for South Africa T20Is | Sakshi
Sakshi News home page

WI vs SA: వెస్టిండీస్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. విధ్వంస‌క‌ర ఆట‌గాడు దూరం

Published Mon, Aug 19 2024 8:03 AM | Last Updated on Mon, Aug 19 2024 9:16 AM

West Indies announces 15-member squad for South Africa T20Is

స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌కు స్టార్ ఆట‌గాళ్లు ఆండ్రీ ర‌స్సెల్‌, జాస‌న్ హోల్డ‌ర్, అల్జారీ జోషఫ్‌, కైల్ మైర్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.  ఈ జట్టుకు రోవ్‌మాన్ పావెల్ మరోసారి సారథ్యం వహించనున్నాడు. 

అతడి డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ వ్యవరించారు. ఇక ఈ జట్టులో వెటరన్‌ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్, పేసర్ మాథ్యూ ఫోర్డ్, యంగ్ బ్యాటర్ అలిక్‌ అథనాజ్‌లకు చోటు దక్కింది. 

ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జ‌ట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఆగ‌స్టు 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లు కూడా ట్రినిడాడ్ వేదిక‌గానే జర‌గ‌నున్నాయి. కాగా ఇప్ప‌టికే ప్రోటీస్ జ‌ట్టు విండీస్ టెస్టు సిరీస్‌ను 0-1తో సొంతం చేసుకుంది.
ద‌క్షిణాఫ్రికాతో టీ20ల‌కు విండీస్ జ‌ట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్‌), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్‌), అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, ఫాబియన్ అలెన్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement