సౌతాంప్టన్: టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను వాతావరణం ప్రభావితం చేస్తోంది. వర్షం కారణంగా టాస్ పడకుండానే తొలి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణుడు కరుణించడంతో రెండో రోజున ఆట ఆరంభమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ(34), శుభ్‌మన్ గిల్(28) ఫర్వాలేదనిపించారు. ఇక నయావాల్ ఛతేశ్వర్ పుజారా(8) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. వెలుతురు లేని కారణంగా ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. కాసేపు తర్వాత ఆటను అనుకూలంగా ఉండడంతో మళ్లీ ప్రారంభించిన కొద్ది సేపటికే వెలుతురు సరిగా లేకపోవడంతో నిలిపివేశారు.
అప్‌డేట్స్:
►వెలుతురు లేని కారణంగా ఆటను ఆపేయగా, ప్రస్తుత టీమిండియా స్కోరు:146/3(64.4 ఓవర్లలో)
►ప్రస్తుతం కోహ్లి(44 పరుగులు), రహానే(29) క్రీజులో ఉన్నారు.
►వెలుతురు లేని కారణంగా ఆటను ఆపేయగా, ప్రస్తుతం ఆటకు అనుకూలంగా ఉండడంతో తిరిగి ప్రారంభించారు.
► కోహ్లి(40 పరుగులు), రహానే(22) క్రీజులో ఉన్నారు. ఆట నిలిచే సమయానికి టీమిండియా స్కోరు: 134/3(58.4 ఓవర్లలో)
►వెలుతురు తక్కువగా ఉన్నందును ఆట కొనసాగించాలా వద్దా అన్న అంశంపై అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో చర్చలు కొనసాగిస్తున్నారు.
►రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లి సేన మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ పదునైన ఇన్‌స్వింగర్‌ను అంచనావేయడంలో పొరబడ్డ నయావాల్ ఛతేశ్వర్ పుజారా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 54 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు(రెండు ఫోర్లు) చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కాగా పుజారా అవుట్ అయిన విధానంపై సందేహం వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి డీఆర్‌ఎస్‌కు వెళ్లగా నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే.
►టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ 28 పరుగుల(3 బౌండరీలు) వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పుజారా, కోహ్లి క్రీజులో ఉన్నారు.
►లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 69-2(28 ఓవర్లలో)
►భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 21వ ఓవర్‌లో జెమీషన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 34 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలు ఉన్నాయి. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు: 62-1.
►20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 62-0
►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 37-0
-ఓపెనర్లు రోహిత్ శర్మ(21), శుభ్‌మన్ గిల్(15) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ జెమీషన్ బౌలింగ్ అటాక్ కొనసాగిస్తున్నాడు.
►భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మరణం పట్ల భారత జట్టు నివాళులు అర్పించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలో అడుగుపెట్టారు.
►ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రెండో రోజున ఆట ఆరంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. కోహ్లి సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. ఇక వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్నీ నికోలస్, బీజే వాట్లింగ్(వికెట్ కీపర్), కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, కైలీ జెమీషన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్.
#TeamIndia is wearing black armbands in remembrance of Milkha Singhji, who passed away due to COVID-19. 🙏#WTC21
— BCCI (@BCCI) June 19, 2021
చదవండి: టీమిండియా బతికిపోయిందిగా; మీరైతే కళ్లప్పగించి చూడండి!
Comments
Please login to add a commentAdd a comment