సౌథాంప్టన్: ఐసీసీ ప్రష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ జట్టు టీమిండియాను ఓడించి కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కివీస్ కెప్టెన్ విలిమమ్సన్‌ను అభినందిస్తూ భారత జట్టు కోహ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2008 నుంచే ఇద్దరు మధ్య మంచి సంబంధాలున్నాయి. 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమిఫైనల్ లో న్యూజిలాండ్, భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ కు కోహ్లి, న్యూజిలాండ్‌కు విలియమ్సన్ సారథ్యం వహించారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
ఇక ఆరో రోజు మొదటి సెషన్ నుంచే భారత్‌పై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది. క్రమం తప్పకుండ వికెట్లు తీయడంలో న్యూజిలాండ్ బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె వంటి వారంతా బ్యాటింగ్‌లో విఫలం కావడంతో రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ 170 పరుగులకు ఆలౌటైంది. ఫైనల్ రిజర్వ్ డే రోజున రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ ఛేదనలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ కీలకమైన పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment