సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా ఓవైపు.. ఆడిన ఐదింటిలోనూ ఓడిన అఫ్గానిస్తాన్ మరోవైపు.. కోహ్లిసేనతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ అఫ్గాన్‌ది వెనుకడుగే.. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందో చెప్పాల్సిన పనిలేదు. అయినా మెరుపు ఆటను ప్రదర్శిస్తూ తమ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకునేందుకు కోహ్లి సేన ఈ మ్యాచ్‌ను వాడుకోవాలనుకుంటోంది.
టోర్నీ సాగుతున్న కొద్దీ భారత్‌కు గాయాల బెడద తీవ్రమవుతున్నా తమ అమ్ముల పొదిలో మిగిలిన అస్త్రాలు కూడా పదునుగానే ఉండడం జట్టుకు సానుకూలాంశం. అటు ఇయాన్ మోర్గాన్ ఊచకోత నుంచి అఫ్గాన్ ఇంకా కోలుకోలేదు. అలాగే తురుపు ముక్క రషీద్ ఖాన్ పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును మరింత దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఏమేరకు పోటీనివ్వగలదో వేచి చూడాలి. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య రెండు వన్డేల జరగ్గా, వీటిలో భారత్ ఒక మ్యాచ్ నెగగ్గా... మరోటి టై అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. తొడకండరాల నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా వేసిన యార్కర్‌కు గాయపడ్డ విజయ్ శంకర్ కోలుకోవడంతో అతన్నే తుది జట్టులో కొనసాగించాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించింది. దాంతో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్‌కు ఆడే అవకాశం దక్కలేదు.
తుది జట్లు
భారత్
విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, చహల్, బుమ్రా
అఫ్గానిస్తాన్
గుల్బదిన్ నైబ్(కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్కర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, నజిబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ అలామ్, ముజీబ్ ఉర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment