'అప్పుడే అతడి మొహంలో నవ్వు చూశా'
సౌంఫ్టన్: పరుగులు చేయడానికి ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. టెస్టులో మెరుగైన రికార్డు ఉన్న కుక్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. భారత్ తో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అతడు 95 పరుగులు చేశాడు. 5 పరుగులతో తేడాతో టెస్టుల్లో 26వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ఫామ్ కోల్పోయిన తంటాలు పడుతున్న ఈ ఇంగ్లీషు కెప్టెన్ ఈ ఇన్నింగ్స్ గొప్ప ఊరటనిచ్చింది. ఐదు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోవడం బాధనిపించిందని కుక్ పేర్కొన్నాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తానిచ్చిన క్యాచ్ వదిలేసిన భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కుక్ పరోక్షంగా థాంక్స్ చెప్పాడు. అదృష్టవశాత్తు అలా జరిగిందన్నాడు. చివరికి జడేజా బౌలింగ్ లో తాను అవుటైన తర్వాతే అతడి మొహంలో నవ్వు చూశానని కుక్ వివరించాడు.