అండర్సన్‌పై నిషేధం తప్పదు!
బీసీసీఐ దగ్గర బలమైన సాక్ష్యం
సౌతాంప్టన్: తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ జడేజాను తోసివేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్‌పై నిషేధం తప్పేలా లేదు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలు తమ దగ్గర ఉన్నాయని బీసీసీఐ చెబుతోంది. వీటిని ఐసీసీ జ్యుడీషియల్ కమిషనర్ గోర్డల్ లూయిస్‌కు సమర్పించనుంది. ఈ వివాదానికి సంబంధించి నేడు విచారణ జరుగుతుంది. అండర్సన్ దోషిగా తేలితే నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనలో జడేజాకు జరిమానాపై బీసీసీఐ చేసిన అప్పీలుపై కూడా శుక్రవారం విచారణ జరుగుతుంది.
సాహా స్థానంలో నమన్ ఓజా
ఇంగ్లండ్ పర్యటనలో భారత రిజర్వ్ వికెట్ కీపర్ సాహా గాయం కారణంగా స్వదేశానికి వెళుతున్నాడు. దీంతో అతడి స్థానంలో నమన్ ఓజాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఓజా ఆస్ట్రేలియాలో భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్నాడు.