
నేరుగా ప్రధానే మీ ఇంటి తలుపు తడితే..
లండన్: సాక్షాత్తు ప్రధాన మంత్రే మీ ఇంటి తలుపుకొడితే తీయకుండా ఉండగలరా.. అసలు ఆ ఆలోచన వస్తేనే మనసు సంతోషంలో తేలిపోకుండా ఉండటం సాధ్యమేనా.. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా లైట్‌గా తీసుకున్నాడు. ప్రధాని వచ్చి డోర్ కొట్టడమే కాదు.. లోపల ఎవరైనా ఉన్నారా అని పిలిచినా, ప్రధానే పిలిచేదని తెలిసినా అతడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ ప్రధాని వెనుదిరిగారు. అయితే, ఆ ప్రధాని నరేంద్రమోదీ కాదు.. బ్రిటన్ దేశ ప్రధాని థెరిసా మే. ఇది జరిగింది సౌతాంప్టన్‌లో. అవును త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాని థెరిసా మే స్వయంగా ప్రతి ఇంటికెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా డేవిడ్ బ్రియాన్ అనే వ్యక్తి ఇంటికెళ్లి తలుపుతట్టారు. లోపల ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదంతా కూడా ఇంటి లోపల ఉన్న డేవిడ్ తన సీసీటీవీ కెమెరా ద్వారా ఇంట్లో టీవీలో చూస్తునే ఉన్నాడు. అయితే, ప్రధాని వచ్చారు కదా అనే ఉత్సాహంతో కాకుండా అలాగే టీవీలో చూస్తుండి పోయాడు. కనీసం అడుగు కూడా వేయలేదు. అసలు బిజీషెడ్యూల్‌తో ఉన్న ఆమె మరో ఇంటికి వెళ్లిపోతుండగా అప్పుడు కదిలి కిటికీలో నుంచి ఆసక్తిగా గమనించాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రియాన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అదిప్పుడు హల్ చేస్తోంది.