డబ్బులు వద్దు... భారత్‌తో టెస్టును చూస్తాం!  | Oval Ticket Holders Show Faith In Test Cricket | Sakshi
Sakshi News home page

డబ్బులు వద్దు... భారత్‌తో టెస్టును చూస్తాం! 

Published Fri, Jun 5 2020 10:26 AM | Last Updated on Fri, Jun 5 2020 10:29 AM

Oval Ticket Holders Show Faith In Test Cricket - Sakshi

సౌతాంప్టన్‌: ఏడాది తర్వాత జరిగే భారత్‌– ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పాత షెడ్యూల్‌ ప్రకారం ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ మధ్య గురువారంనుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. తొలి నాలుగు రోజుల టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే ఇప్పు డు ఈ మ్యాచ్‌ వేదికను సౌతాంప్టన్‌కు మార్చారు. దాంతో టికెట్‌ డబ్బులు వంద శాతం వాపస్‌ ఇవ్వాలా...లేక వచ్చే ఏడాది ఇక్కడ జరి గే భారత్‌–ఇంగ్లండ్‌ టెస్టు కోసం వాటిని అలాగే అట్టిపెట్టాలా అని ఫ్యాన్స్‌ను కోరింది. వీరిలో 85 శాతం మంది తమకు డబ్బులు వద్దు, సంవత్సరం తర్వాతైనా సరే మ్యాచ్‌ చూసేందుకు వస్తాం అంటూ అంగీకారాన్ని తెలియజేయడం విశేషం. ఇంగ్లండ్‌లో టెస్టు క్రికెట్‌కు ఉండే ఆదరణ ఎలాంటిదో ఇది చూపిస్తోంది. (అందుకే సోషల్‌ మీడియాకు ధోని దూరంగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement