మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ తొలుత వన్డే సిరీస్ ఆడుతుంది. మూడు వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 31 (ఆంటిగ్వా), నవంబర్ 2 (ఆంటిగ్వా), నవంబర్ 6 (బార్బడోస్) తేదీల్లో జరుగనున్నాయి.
అనంతరం నవంబర్ 9 (బార్బడోస్), 10 (బార్బడోస్), 14 (సెయింట్ లూసియా), 16 (సెయింట్ లూసియా), 17 (సెయింట్ లూసియా) తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (అక్టోబర్ 3) ప్రకటించారు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ విండీస్‌తో సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. వీరిలో జాఫర్ చోహాన్ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగా.. జాన్ టర్నర్, డాన్ మౌస్లీ జాతీయ జట్టుకు మరోసారి ఎంపికయ్యారు. విండీస్‌తో సిరీస్‌లకు ఈ 14 మందితో పాటు మరో ఇద్దరిని కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయనుంది.
ఆ ఇద్దరు పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌తో ముగిసిన అనంతరం (అక్టోబర్ 28) జట్టుతో చేరతారు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టిన హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బ్రూక్‌తో పాటు మరో ఆటగాడు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులో చేరతాడు.
వెస్టిండీస్ వన్డే మరియు టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహాన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్
చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment