
సౌతాంప్టన్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటితో పాటు టీమిండియాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజా ప్రపంచకప్‌లో భాగంగా భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. టోర్నీ ప్రారంభమైన వారం రోజుల తర్వాత టీమిండియాకు మ్యాచ్ ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో విహరిస్తున్నారు. తాజాగా సౌతాంప్టన్‌లో టీమిండియా ఆటగాళ్లు పెయింట్ బాలింగ్ గేమ్ ఆడటానికి వెళ్లారు.
కోహ్లితో పాటు ఈ గేమ్ ఆడటానికి వెళ్లిన వారిలో ధోని, చహల్, రాహుల్, ధావన్, దీపక్ చాహర్, బుమ్రా, కుల్దీప్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కోహ్లి షేర్ చేస్తూ ‘ఫన్ టైమ్ విత్ బాయ్స్’అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు చేసిన పొరపాట్లపై, అదేవిధంగా ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫీల్డింగ్ డ్రిల్‌ను నిర్వహించింది. ఇక విరాట్ కోహ్లి నెట్స్‌లో బౌలింగ్ చేయడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇక ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సఫారీ జట్టు ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment