టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.
హిట్‌మ్యాన్ జైత్రయాత్ర
కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి నుంచి టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ సారథ్యంలోని టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. క్లీన్‌స్వీప్‌లతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించింది.
తొలిసారిగా..
ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలిసారి విదేశీ గడ్డపై టీమిండియాను ముందుకు నడిపాడు రోహిత్. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు సృష్టించడం గమనార్హం. ఇక రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు కరోనా బారిన పడ్డ రోహిత్ శర్మ కోలుకుని ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భాగమైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు సాధించాడు. ఇక దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు తోడు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియా ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఏకంగా 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్:
టాస్: ఇండియా- బ్యాటింగ్
ఇండియా స్కోరు: 198/8 (20)
ఇంగ్లండ్ స్కోరు: 148 (19.3)
విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)
చదవండి: Rohit Sharma: హార్దిక్ పాండ్యా అద్భుతం! ఆ తప్పులు పునరావృతం కానివ్వం: రోహిత్ శర్మ
Vintage Mo.
— England Cricket (@englandcricket) July 7, 2022
Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/AQ8cK5sTph
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) July 7, 2022
First captain to win 1⃣3⃣ successive T20Is - Congratulations, @ImRo45. 👏 👏#TeamIndia | #ENGvIND pic.twitter.com/izEGfIfFTn
Comments
Please login to add a commentAdd a comment