ఎండకు చల్ల గొడుగు | beat the heat with these refreshing juices | Sakshi
Sakshi News home page

ఎండకు చల్ల గొడుగు

Published Fri, Feb 24 2023 1:16 AM | Last Updated on Fri, Feb 24 2023 1:16 AM

beat the heat with these refreshing juices - Sakshi

మార్చి నెల రానేలేదింకా...  వాతావరణం మారిపోయింది.  ఎండకు గొడుగు పట్టాల్సిందే.  ఇంట్లోనే ‘చల్ల’ గొడుగు పడదాం.  పెరుగు చిలికి... లస్సీ చేద్దాం. 


రోజ్‌ లస్సీ 
కావలసినవి:  పెరుగు – 2 కప్పులు; చల్లటి నీరు – కప్పు; చక్కెర లేదా తేనె – 3 టేబుల్‌ స్పూన్‌లు; రోజ్‌ సిరప్‌ – 2 టేబుల్‌ స్పూన్‌లు; పిస్తా – 10 (పలుకులు చేయాలి).
తయారీ: మిక్సీ జ్యూస్‌ జార్‌లో పెరుగు, రోజ్‌సిరప్, చక్కెర, నీరుపోసి బ్లెండ్‌ చేయాలి. రుచిని బట్టి మరింత తీపి కావాలనుకుంటే మరో రెండు స్పూన్‌ల చక్కెర వేసి కరిగే వరకు కొద్దిసేపు బ్లెండ్‌ చేయాలి. గ్లాసులో పోసి పిస్తాతో గారి్నష్‌ చేసి సర్వ్‌ చేయాలి. 


మసాలా చాస్‌
కావలసినవి: పెరుగు – కప్పు; జీలకర్రపొ డి – అర టీ స్పూన్‌; చాట్‌ మసాలా – పా వు టీ స్పూన్‌; నల్ల ఉప్పు – చిటికెడు; అల్లం తురుము – పా వు టీ స్పూన్‌; పచ్చిమిర్చి – 1 ( తరగాలి); మిరియాలపొ డి – పా వు టీ స్పూన్‌; ఇంగువ – చిటికెడు; ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; పుదీనా – 5 ఆకులు; కొత్తిమీర తరుగు – టీ స్పూన్‌; మంచి నీరు – 4 కప్పులు.
తయారీ: ఒక పా త్రలో పెరుగు, జీలకర్ర, చాట్‌ మసాలా, జీలకర్రపొ డి, నల్ల ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల΄÷డి, ఇంగువ, ఉప్పు వేసి బీటర్‌తో బాగా చిలకాలి. ఇప్పుడు నీటిని పోసి అరనిమిషం పా టు చిలకాలి. చివరగా పుదీన, కొత్తిమీర వేసి తాగడమే. రోజూ ఉదయం బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు తాగితే ఎండ వేడిమి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. 


కేసర్‌ ఇలాచీ ...
కావలసినవి:  పెరుగు – 2 కప్పులు; కుంకుమ పువ్వు రేకలు – 2; తేనె– 3 టేబుల్‌ స్పూన్‌లు; యాలకులు – 6 (తొక్క వేరు చేసి గింజలనుపొ డి చేయాలి); బాదం తరుగు – టేబుల్‌ స్పూన్‌; పిస్తా – టేబుల్‌ స్పూన్‌.
తయారీ: ఒక పా త్రలో బాదం, పిస్తా మినహా పైన తీసుకున్న అన్నింటినీ వేసి బీటర్‌తో రెండు నిమిషాల సేపు చిలకాలి. తీపి సరి చూసుకుని అవసరమైతే మరికొంత తేనె వేసి కలిసేవరకు చిలకాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి పైన బాదం, పిస్తాతో అలంకరించి సర్వ్‌ చేయాలి. ఇది మధ్యాహ్న భోజనంలో భాగంగా తీసుకుంటే బాగుంటుంది. 


స్వీట్‌ మింట్‌ ... 
కావలసినవి:  పెరుగు – కప్పు; తేనె– 2 టేబుల్‌ స్పూన్‌లు; పుదీన ఆకులు – అర కప్పు; జీడిపప్పు – 20 (వలిచినవి); బాదం – 10 (తరగాలి); పిస్తా – 10 (తరగాలి); మంచి నీరు – 4 కప్పులు.
తయారీ: జీడిపప్పులను చిన్న పలుకులు చేసి, బాదం తరుగు, పిస్తా తరుగులో కలిపి పక్కన ఉంచుకోవాలి.  మిక్సీ జార్‌లో పెరుగు, పుదీన, తేనె వేసి బ్లెండ్‌ చేయాలి. నీటిని కలిపి మరోసారి కలిసేలా తిప్పాలి. ఈ లస్సీని గ్లాసుల్లో పోసి బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి సర్వ్‌ చేయాలి. ఇష్టమైతే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు. 


కేసర్‌ పిస్తా ...
కావలసినవి: పెరుగు – కప్పు; చక్కెర లేదా తేనె – టేబుల్‌ స్పూన్‌; క్రీమ్‌– పా వు కప్పు; కుంకుమ పువ్వు– పది రేకలు; పిస్తా – టేబుల్‌ స్పూన్‌; మంచి నీరు – 4 కప్పులు.
తయారీ: మిక్సీజార్‌లో పిస్తా, పెరుగు, క్రీమ్, చక్కెర లేదా తేనె, కుంకుమ పువ్వు నాలుగురేకలు వేసి బ్లెండ్‌ చేయాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి ఐస్‌ క్యూబ్స్‌ వేసి పైన రెండు కుంకుమ పువ్వు రేకలతో గా ర్నీష్‌ చేసి సర్వ్‌ చేయాలి.  

పైనాపిల్‌ ...
కావలసినవి: పైనాపిల్‌ ముక్కలు – అర కప్పు; చక్కెర – పా వు కప్పు; పెరుగు – 2 కప్పులు; క్రీమ్‌ – పా వు కప్పు; పుదీనా – 4 ఆకులు; ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
తయారీ: పెనం వేడి చేసి పైనాపిల్‌ ముక్కలు, చక్కెర వేసి సన్న మంట మీద కలుపుతూ మగ్గనివ్వాలి. సుమారుగా మూడు నిమిషాల సేపటికి ముక్కలు మెత్తబడతాయి. ఆ తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. 
ఒక పా త్రలో పెరుగు, క్రీమ్‌ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. ఇందులో ఉడికించిన పైనాపిల్‌ మిశ్రమాన్ని వేసి చిలకాలి. ఈ లస్సీని గ్లాసులో పోసి పుదీనాతో అలంకరించి ఐస్‌ క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేయాలి. చల్లగా చిక్కగా ఇష్టపడే వాళ్లు ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తరవాత తాగవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement