Summer Drinks- Lassi Recipe: భారత ఉపఖండంలో ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో శతాబ్దాల కాలం నుంచి విరివిగా వాడుకలో ఉన్న వేసవి పానీయం లస్సీ. హిందీలోని కొన్ని మాండలికాల్లో మజ్జిగనే ‘లస్సీ’ అంటారు. ‘లస్సీ’ తయారీలో కమ్మని పెరుగులో చక్కెర కలిపి, దానిని బాగా చిలికి తయారు చేస్తారు. అందులో జీడిపప్పు, కిస్మిస్, చెర్రీ, రోజ్‌వాటర్, స్ట్రాబెర్రీ వేసుకుంటారు. లస్సీ తయారీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన శైలి.
పురాణాలలో వర్ణించిన ‘రసాల’ అనే పానీయానికి లస్సీ ఆధునిక రూపం అనుకోవచ్చు. విరాటరాజు కొలువులో వలలుడి వేషంలో ఉన్నప్పుడు భీముడు ‘రసాల’ను తయారు చేసినట్లు ప్రతీతి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పాకిస్తాన్‌లోని సింద్ ప్రాంతాలు లస్సీ తయారీకి ప్రసిద్ధి. ఒడిశాలో లస్సీని ఇంకొంత విలక్షణంగా తయారు చేస్తారు. పెరుగులో పచ్చికోవాను కలిపి బాగా చిలికి, అందులో లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు, మొగలిపూల ఎసెన్స్ వంటివి కలుపుతారు. పెరుగులో ఉండే అన్ని పోషకాలూ లస్సీలోనూ ఉంటాయి.
చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే
Comments
Please login to add a commentAdd a comment