Muskmelon Juice Recipe- Health Benefits In Telugu: వేసవిలో విరివిగా దొరికే పండ్లలో కర్బూజ ఒకటి. దోసజాతికి చెందిన ఈ పండును ఈ సీజన్‌లో తింటే చలవచేస్తుంది అంటారు. సహజంగా ఇది మరీ అంతగా తియ్యగా ఉండదు. కాబట్టి కాస్త పంచదార వేసి జ్యూస్ రూపంలో తీసుకుంటే రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలు ఉన్నందున వీలు చిక్కినప్పుడల్లా తీసుకోవడం మంచిది.
కర్బూజా జ్యూస్ తయారీ
►అరకేజీ మస్క్‌మిలాన్ (కర్బూజ) ముక్కలను మిక్సీజార్ లో వేసుకోవాలి.
►దీనిలో రెండు అంగుళాల అల్లం ముక్కను తురుముకుని వేయాలి.
►రుచికి సరిపడా పంచదార, చిటికెడు ఉప్పు, టీస్పూను మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
►గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకుని నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
►మస్క్‌మిలన్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
►రక్త పీడనం ఎక్కువగా ఉన్న వారు ఈ జ్యూస్ తాగడం వల్ల పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని క్రమబద్ధీకరించి, బీపీని నియంత్రణలో ఉంచుతాయి.
►జ్యూస్‌లో ఉన్న విటమిన్ ఏ, బీటా కెరోటిన్‌లు కంటిలో శుక్లం ఏర్పడకుండా నిరోధిస్తాయి.
►దీనిలోని పోషకాలతో కూడిన కార్బోహైడ్రేట్స్ బరువుని నియంత్రణలో ఉంచుతాయి.
►ఆకలి లేమితో బాధపడేవారికి ఇది స్వాభావికమైన ఔషధంగా పనిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది.
► అసిడిటీని , అల్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
► ఇందులో విటమిన్ సి పుష్కలం. వ్యాధినిరోధకతను సమకూరుస్తుంది.
► కర్బూజలో ఐరన్ పాళ్లు ఎక్కువ. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం మేలు.
చదవండి: Pineapple Cake: ఈ పదార్థాలు ఉంటే చాలు.. పైనాపిల్ కేక్ రెడీ!
Comments
Please login to add a commentAdd a comment