summer camp
-
జీడీ గోయెంకా స్కూల్ సమ్మర్ క్యాంప్ విజయవంతం (ఫొటోలు)
-
ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!
ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్ క్యాంప్ జరిగింది. ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్ బఫెట్ భార్య ఆస్ట్రిడ్ బఫెట్ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్ బఫెట్ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రానా సందడి (ఫొటోలు)
-
కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!
Muskmelon Juice Recipe- Health Benefits In Telugu: వేసవిలో విరివిగా దొరికే పండ్లలో కర్బూజ ఒకటి. దోసజాతికి చెందిన ఈ పండును ఈ సీజన్లో తింటే చలవచేస్తుంది అంటారు. సహజంగా ఇది మరీ అంతగా తియ్యగా ఉండదు. కాబట్టి కాస్త పంచదార వేసి జ్యూస్ రూపంలో తీసుకుంటే రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలు ఉన్నందున వీలు చిక్కినప్పుడల్లా తీసుకోవడం మంచిది. కర్బూజా జ్యూస్ తయారీ ►అరకేజీ మస్క్‌మిలాన్ (కర్బూజ) ముక్కలను మిక్సీజార్ లో వేసుకోవాలి. ►దీనిలో రెండు అంగుళాల అల్లం ముక్కను తురుముకుని వేయాలి. ►రుచికి సరిపడా పంచదార, చిటికెడు ఉప్పు, టీస్పూను మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకుని నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాలు ►మస్క్మిలన్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ►రక్త పీడనం ఎక్కువగా ఉన్న వారు ఈ జ్యూస్ తాగడం వల్ల పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని క్రమబద్ధీకరించి, బీపీని నియంత్రణలో ఉంచుతాయి. ►జ్యూస్‌లో ఉన్న విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు కంటిలో శుక్లం ఏర్పడకుండా నిరోధిస్తాయి. ►దీనిలోని పోషకాలతో కూడిన కార్బోహైడ్రేట్స్ బరువుని నియంత్రణలో ఉంచుతాయి. ►ఆకలి లేమితో బాధపడేవారికి ఇది స్వాభావికమైన ఔషధంగా పనిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. ► అసిడిటీని , అల్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ► ఇందులో విటమిన్ సి పుష్కలం. వ్యాధినిరోధకతను సమకూరుస్తుంది. ► కర్బూజలో ఐరన్ పాళ్లు ఎక్కువ. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం మేలు. చదవండి: Pineapple Cake: ఈ పదార్థాలు ఉంటే చాలు.. పైనాపిల్ కేక్ రెడీ! -
‘అందుకు మానసిక ధైర్యం చాలా అవసరం’
జీవితంలో ఏదో అవ్వాలనుకుని ఇంకేదో అవుతుంటాము. కొన్నిసార్లు మనం ఏది అనుకున్నా డెస్టినేషన్ లో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. అచ్చం ఇలానే నేత్రా కుమనన్ జీవితంలో జరిగింది. నేత్ర మరెవరో కాదు మన దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనే తొలి మహిళా సెయిలర్. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేత్ర సెయిలర్ అవ్వాలనుకోలేదు. అందరిలాగే స్కూలుకెళ్లి చదువుకుంటోన్న నేత్ర పన్నెండేళ్ల వయసులో మొదట టెన్నిస్ నేర్చుకుందామని బ్యాట్ పట్టుకుంది. కానీ అది కుదరలేదు. తర్వాత సైక్లింగ్ చేద్దామనుకుంది ఇది కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఇలా కాదు భారతీయ సంప్రదాయాలకు తగ్గట్టుగా భరతనాట్యం నేర్చుకుందామనుకుంది. అది కూడా పూర్తి చేయలేదు. అనుకోకుండా వేసవిసెలవుల్లో నేత్ర వాళ్ల అమ్మ ‘‘సమ్మర్ క్యాంప్‌లో భాగంగా సెయిలింగ్ నేర్పుతున్నారు వెళ్లు’’ అని చెప్పడంతో నేత్ర అక్కడికి వెళ్లింది. అప్పుడు తనకు తెలియదు. భవిష్యత్తులో దేశంలోనే తొలి మహిళా సెయిలర్‌ని అవుతానని. ఇటీవల ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్ లో నేత్ర టాప్‌లో నిలిచి ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసింది. 21 పాయింట్ల తేడాతో భారత్‌కు చెందిన రమ్య, శరవణపై పైచేయి సాధించి క్వాలిఫై అయింది. మరోరేసు మిగిలి ఉండగానే నేత్ర టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్ల ఆధిక్యంలో ఉండడంతో ఒకరోజు ముందుగానే ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం. ఇప్పటిదాకా తొమ్మిది మంది సెయిలర్లు భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనగా తొలిసారి మహిళా విభాగంలో నేత్ర అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎస్ఆర్ఎం కాలేజీలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతోన్న నేత్ర రెండుసార్లు జాతీయ ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంది. మరో రెండు సందర్భాల్లో రన్నరప్‌గా నిలిచింది. 2018లో జకార్తాలో జరిగిన ఏíషియన్ గేమ్స్‌లో లేజర్ రేడియల్‌లో ఐదోస్థానం లో నిలిచింది. గతేడాది జనవరిలో జరిగిన హెంపల్ వరల్డ్ కప్ సిరీస్‌లో కాంస్యపతకం గెలుచుకుంది. సెయిలింగ్ వరల్డ్ కప్ మెడల్ గెలుచున్న తొలి భారతీయ మహిళగా నేత్ర చరిత్ర సృష్టించింది. గత కొన్నేళ్లుగా జాతీయ చాంపియన్‌గా నిలుస్తోన్న నేత్ర ఏషియన్ గేమ్స్‌లో కొద్దిలో మిస్ అయినప్పటికీ నిరంతర కృషితో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు చేరుకుంది. నేత్ర మాట్లాడుతూ..‘‘నేను చెన్నైలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఒకసారి సమ్మర్ క్యాంప్‌లో భాగంగా తొలిసారి సెయిలింగ్‌లో పాల్గొన్నాను. ఇతర రకాల క్రీడలతో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంటుంది. సెయిలింగ్ చేయడానికి మానసిక ధైర్యం చాలా అవసరం. ఒకసారి చూద్దాం అని వెళ్లిన నేను సెయిలింగ్ బాగా నచ్చడంతో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాను. గతేడాది లాక్డౌన్ సమయంలో స్పెయిన్‌లో చిక్కుకుపోయాను. అప్పుడు రెండుసార్లు ఒలింపియన్‌గా నిలిచిన హంగేరియాకు చెందిన థామస్ ఇస్జ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. రేసింగ్‌లో ఒత్తిడిని ఎలా జయించాలో ఆయన చక్కగా వివరించారు. ఒకటిన్నర ఏడాదిపాటు ఇంటికి దూరంగా ఉండి కఠోర దీక్షతో కష్టపడడంతో ఈరోజు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాను’’అని నేత్ర చెప్పింది. ‘‘ఇవి నా తొలి ఒలింపిక్ గేమ్స్. సాయశక్తులా ప్రయత్నించి ఈ పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తాను. తరువాతి ఒలింపిక్స్‌లో కూడా పోటీపడతా’’ అని నేత్ర ధీమా వ్యక్తం చేసింది. ఇక ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతుండడం వల్ల ఇటు నా బీటెక్ ను అటు సెయిలింగ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. మా నాన్న గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనవల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న.. నా వెనుక ఉండి ఆయన నన్ను ముందుకు నడిపించారు.’’ అని నేత్ర చెప్పింది. -
నేటి నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
శ్రీకాకుళం న్యూకాలనీ : వేసవి క్రీడా శిక్షణా శిబిరాల (సమ్మర్ కోచింగ్ క్యాంప్)కు వేళయింది. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల వేదికలుగా శిక్షణా శిబిరాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏటా ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు 30 రోజులపాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ల పేరిట క్రీడాకారులు, ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. సాక్షి ముందుగా చెప్పినట్టుగానే ఈ ఏడాది 50 కేంద్రాల్లో శిక్షణకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రతికూల వాతావరణంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, శిక్షకులు ఆందోళన చెందుతున్నారు. 14 ఏళ్లలోపు వారికే చాన్స్.. ఈ క్యాంప్‌లకు హాజరయ్యే క్రీడాకారులు, విద్యార్థులు 14 ఏళ్లు లోపు వారికే అధికారులు అవకాశం కల్పించడంపై క్రీడాసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కనీసం 17 ఏళ్ల వరకు అవకాశం కల్పించాల్సిందని పీఈటీ సంఘ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రానికి రూ.10 వేల చొప్పున కేటాయించనున్నారు. ఈ నిధులతో క్యాంప్ నిర్వహణకు అవసరమయ్యే క్రీడా పరికరాలు, సామగ్రి, మౌలిక సదుపాయాలు, తాగునీరు, శిక్షకునికి గౌరవ వేతనం చెల్లించనున్నారు. పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులను కోచ్‌గా నియమించారు. వాలీబాల్‌కే పెద్దపీట.. ఈ ఏడాది క్రీడాధికారులు దాదాపుగా అన్ని క్రీడాంశాలకు అవకాశం కల్పించారు. అత్యధికంగా ఆదరణ కలిగిన వాలీబాల్, ఇతర గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. వాలీబాల్ 6, అథ్లెటిక్స్ 5, కబడ్డీ 4, హ్యాండ్‌బాల్ 4, ఖోఖో 3, షటిల్ బ్యాడ్మింటన్ 3, తైక్వాండో 3, సాఫ్ట్‌బాల్ 3, వెయిట్‌లిఫ్టింగ్ 2, ఫుట్‌బాల్ 2, హాకీ 2 కేటాయించారు. బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సప్కతక్ర, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నీకాయిట్, లాన్‌టెన్నిస్, చెస్, స్కేటింగ్, జూడో, ఉషూ, రైఫిల్‌షూటింగ్ క్రీడాంశాలకు చెరో శిక్షణా శిబిరాన్ని కేటాయించారు. సక్సెస్ చేయాలని పిలుపు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను విజయవంతం చేయాలని సెర్ఫ్ సీఈఓ బి.ప్రసాదరావు, చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్ పిలుపునిస్తున్నారు. శిక్షకులు తమ బాధ్యతగా గుర్తించి క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని, సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. వివరాలకు 98660 98642 నంబర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
విజయనగరం రూరల్ : భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో గొప్పదని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి అన్నారు. ఓం మందిరంలో భగవాన్ శ్రీసత్యసాయి ఆరాధన సందర్భంగా వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. శిక్షణ తరగతుల సమన్వయకర్త, ఉపాధ్యాయుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే తరగతుల్లో వేదం, యోగా, ఆధ్యాత్మిక భజన, జ్యోతి ధ్యానం, ఆరోగ్యం పరిశుభ్రత, భగవద్గీత, మానవత విలువలు, భారతం కథలు, కలియుగ వైకుంఠం, పంచయజ్ఞాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస్ కో–ఆర్డినేటర్ బి.రమేష్‌కుమార్, కన్వీనర్ సన్యాసినాయుడు, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇస్కాన్ ఆధ్వర్యంలో వేసవి శిబిరం
కవాడిగూడ (హైదరాబాద్) : ఇస్కాన్ కూకట్పల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గీతా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డెరైక్టర్ మహా శృంగదాస గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదిరోజులపాటు 8 నుండి 20 ఏళ్ల వయసు వారి కోసం భగవద్గీతపై వేసవి శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. శిబిరం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కొనసాగుతుందన్నారు. పిల్లలకు వ్యక్తిత్వ వికాసంతో పాటు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తోబుట్టువులతో ఎలా ప్రవర్తించాలి, విద్యా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సంస్కృత శ్లోక పఠనం, వైధిక కథలు, డ్రామాలు, డ్యాన్స్, ఆటలు, భగవద్గీత యధాతథం తదితర విషయాలను అత్యంత సరళంగా నేర్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8008924201, 9866340588 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. -
‘సాక్షి’ గ్రూప్, భాష్యం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్
హైదరాబాద్: పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడం కోసం, మరింత మెరుగుపెట్టడం కోసం సాక్షి మీడియా గ్రూప్, భాష్యం విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం కాబోతోంది. యోగా, చెస్, పెయింటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కలినరీ, పియానో, గిటార్ తదితర అంశాల్లో ఈ శిక్షణ జరగనుంది. భాష్యం పబ్లిక్ స్కూల్స్‌లో మే 3వ తేదీ వరకు రెండు పాస్‌పోర్టు ఫొటోలు, వివరాలతో వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 4 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిక్షణ ఉంటుంది. వివరాలకు 04023256138లో సంప్రదించవచ్చు. -
ఇక లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ..
మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో హైదరాబాదీ, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సందడి చేశారు. అజీజ్‌నగర్ కు బుధవారం విచ్చేసిన సొగసరి బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ 50 ఎకరాల స్థలంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. శ్రీనిధి స్కూల్ క్యాంపస్‌లో అకాడమీని ప్రారంభించి, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేసవిలో క్రికెట్ కోసం సమ్మర్ క్యాంప్ కూడా ఆయన ఏర్పాటు చేయనున్నారు. మణికట్టు ఆటగాడిగా పేరున్న వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్‌మన్ తమ ప్రాంతానికి రావడంతో అజీజ్‌నగర్ వాసులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆయనను చూడటానికి శ్రీనిధి క్యాంపస్ కు తరలివచ్చారు. అభిమానులను పలకరించి, క్రికెట్ పై ప్రేమ పెంచుకుంటే ఆటలో రాణించడం సులభమవుతుందని ఈ సందర్భంగా లక్ష్మణ్ అన్నారు. ఆయన పదేళ్లకు పైగా భారత జట్టుకు విశేషసేవలందించారు. వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెప్పగానే 2001లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోల్‌కతా టెస్ట్ లో ఆయన చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ మనకు గుర్తుకువస్తుంది. -
ఈ సమ్మర్ మీదే!
టీనేజ్ టీనేజ్ లైఫ్‌లో వేసవి సెలవులు అమూల్యమైనవి. ఈ కాలంలో ప్రపంచం మీ సొంతం అవుతుంది. వేసవి అనేది రిలాక్స్ అవడం కోసం మాత్రమే కాదు. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి తగిన సమయం.. అందుకే మీ కోసం కొన్ని సూచనలు... స్నేహితులతో కలిసి ఔట్‌డోర్‌లో సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేయండి.కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఈ వేసవిలో కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సాధించదలచిన లక్ష్యాల జాబితా ఒకటి తయారు చేసుకోండి. ఆ లక్ష్యాల సాధనకు అవసరమైన ప్రణాళికను పక్కాగా తయారుచేసుకోండి.బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి తగిన వ్యాయమాలు చేయండి. బరువు మరీ తక్కువగా ఉంటే పెరిగే ప్రయత్నం చేయండి. వెళ్లి మంచి పుస్తకాలను ఎంపిక చేసుకోండి. సెలవులు పూర్తయ్యేలోపు వాటిని చదవడం పూర్తి చేయండి.సామాజిక సేవా కార్యమ్రాల్లో పాల్గొనండి.